ఒక జాతి సాంస్కృతిక గొంతుక భాషేనని, అందుకే అమ్మ భాష తెలుగు వ్యాప్తికి అందరూ బాధ్యత తీసుకోవాలని, మిజోరాం గవర్నర్ డా. కంభంపాటి హరిబాబు సూచించారు. తెలుగు భాష పట్ల అభిమానం పెంచుకుని వ్యాప్తి చేయడం, ప్రోత్సహించడం చేయాలన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్, చైతన్య విద్యాసంస్థల సంయుక్త ఆధ్వర్యంలో రాజమండ్రి గైట్ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న త్రిదిన అంతర్జాతీయ తెలుగు మహా సభలలో భాగంగా రెండవరోజు రాజరాజ నరేంద్ర వేదికపై నిర్వహించిన కృతజ్ఞతాంజలి సభలో ఈయన ముఖ్య…
బీజేపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు కంభంపాటి హరిబాబు. రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు కు అందజేసిన హరిబాబు అనంతరం మాట్లాడుతూ… మిజోరాం రాష్ట్రానికి గవర్నర్ గా నియమించడం సంతోషం గా ఉంది. గవర్నర్ గా నియమించినందుకు రాష్ట్రపతి కి,ప్రధానమంత్రి మోదీ కి,హోమ్ మంత్రి అమిత్షా కు ధన్యవాదాలు. మిజోరాం ప్రజలకు నా సేవలు అందిస్తాను. రాజ్యాంగ పదవులలో ఉన్నవారు రాజకీయాలకు దూరంగా ఉండాలి. అందుకే బీజేపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను అని…