బీజేపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు కంభంపాటి హరిబాబు. రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు కు అందజేసిన హరిబాబు అనంతరం మాట్లాడుతూ… మిజోరాం రాష్ట్రానికి గవర్నర్ గా నియమించడం సంతోషం గా ఉంది. గవర్నర్ గా నియమించినందుకు రాష్ట్రపతి కి,ప్రధానమంత్రి మోదీ కి,హోమ్ మంత్రి అమిత్షా కు ధన్యవాదాలు. మిజోరాం ప్రజలకు నా సేవలు అందిస్తాను. రాజ్యాంగ పదవులలో ఉన్నవారు రాజకీయాలకు దూరంగా ఉండాలి. అందుకే బీజేపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను అని తెలిపారు. 30 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ క సేవలు అందించాను. బీజేపీ పార్టీ ని వీడుతున్నందుకు బాధగా ఉంది అని పేర్కొన్నారు.