ఐపీఎల్‌లో సురేష్ రైనాకు అద్భుతమైన రికార్డు ఉంది. చెన్నై సూపర్‌కింగ్స్ తరఫున అతడు గుర్తుండిపోయేలా ప్రదర్శనలు చేశాడు. అయినా ఈ ఏడాది అతడు ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోలేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సురేష్ రైనాకు అరుదైన గౌరవం దక్కింది. మాల్దీవులు ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్ఠాత్మక ‘స్పోర్ట్స్ ఐకాన్’ అవార్డుకు రైనా ఎంపికయ్యాడు. ఈ అవార్డు కోసం 16 మంది అంతర్జాతీయ ఆటగాళ్లు పోటీపడగా చివరకు సురేష్ రైనాను వరించింది. ఈ అవార్డు కోసం…