సంగారెడ్డి సిగాచి పరిశ్రమ ప్రమాదంపై తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలైంది.. సిగాచి పరిశ్రమ ప్రమాదంపై టీజీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది. న్యాయవాది కె.బాబూరావు సిగాచిపై పిల్ దాఖలు చేశారు. పరిశ్రమలో భద్రతా చర్యలు లేవని, పేలుడు ఘటనలో ఇంకా 8 మంది ఆచూకీ లభించలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. బాధితులకు ప్రకటించిన పరిహారం ప్రభుత్వం ఇంకా చెల్లించలేదు.. పరిశ్రమ యజమానిని ఇప్పటివరకు అరెస్టు చేయలేదు..
Sigachi Factory Blast: సంగారెడ్డి జిల్లా సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర పేలుడు ఘటనపై అధికారులు కీలక ప్రకటన చేశారు. ప్రమాదం జరిగిన రోజు గల్లంతైన 8 మంది కార్మికులు ఇంకా కనిపించకపోవడంతో, ఇక వారి ఆచూకీ లభించడం అసాధ్యమే అని అధికారులు తేల్చేశారు. రాహుల్, శివాజీ, వెంకటేష్, విజయ్, అఖిలేష్, జస్టిన్, రవి, ఇర్ఫాన్ ల బాడీలు పేలుడు సమయంలో తీవ్రంగా కాలిపోయి బూడిదయ్యి ఉంటారని యాజమాన్యం అనుమానం వ్యక్తం చేస్తుంది. దీని కారణం ఇప్పటివరకు…
SLBC Tunnel: ఎస్ఎల్‌బిసి (SLBC) టన్నెల్ విషాద ఘటన అందరికి తెలిసిన విషయమే. టన్నెల్ లో పనులు చేస్తున్న కార్మికులు లోపల చిక్కుకుపోయి ఎనిమిది మూర్తి చెందారు. ఈ ఘటన జరిగిన నాటి నుంచి సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ రెస్క్యూ ఆపరేషన్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటివరకు 53 రోజులుగా సహాయక చర్యలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. అయినప్పటికీ ఇంకా ఆరుగురు మృతదేహాల ఆచూకి లభించకపోవడం విచారకరం. టన్నెల్ లో పేరుకుపోయిన మట్టి, టిబియం…