ఆకాష్‌టీర్.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తున్న పేరు. దాయాది దేశం పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారత్ ప్రయోగించిన అత్యంత పవర్‌ఫుల్ వెపన్ సిస్టమ్. శత్రు దేశం గుండెల్లో రైళ్లు పరుగులు పెట్టించింది. అంతేకాకుండా ప్రపంచ నిపుణులనే కలవర పెట్టింది.
అగ్ర రాజ్యం అమెరికా హెచ్చరించినట్లుగానే ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. దీంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. కొద్దిసేపటి క్రితమే ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడులు చేయడం మొదలు పెట్టింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ అధికారులు ధృవీకరించారు.
రక్షణ శాఖకు అత్యాధునిక ఆయుధాలను తయారు చేసివ్వడంలో అద్భుతమైన ప్రగతి సాధించామని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) చైర్మన్ డాక్టర్ సమీర్ వి. కామత్ పేర్కొన్నారు.
కిమ్ జోంగ్ ఉన్.. నిరంకుశ పాలనకు పెట్టింది పేరు. ఎప్పటికప్పుడు క్షిపణి ప్రయోగాలు చేసి పొరుగు దేశాలతో పాటు అగ్రరాజ్యం అమెరికాకు హెచ్చరికలు జారీ చేస్తుంటారు. తాజాగా మరోసారి క్షిపణి ప్రయోగాలను ఉత్తర కొరియా చేపట్టింది. ఉత్తర కొరియా ఆదివారం రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగిస్తూ మరోసారి కవ్వింపు చర్యలను మొదలుపెట్టింది.
ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దాడులు ప్రపంచవ్యాప్తంగా సంక్షోభానికి కారణం అవుతున్నాయి. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో శాంతి చర్చలు జరపాలని ఇరుదేశాలను ప్రపంచం కోరుతోంది. దీంతో ఈ వారాంతంలో మరోసారి రష్యాతో శాంతి చర్చలు జరపాలనే ఆలోచనలో వుంది ఉక్రెయిన్. రష్యా దాడుల్లో ఇప్పటివరకు 331 మంది పౌరులు మృతి చెందగా 685 మందికి గాయాలయ్యాయి. వాస్తవానికి ఈ సంఖ్య ఇంకా ఎక్కువ ఉండవచ్చంటున్నారు. ఖేర్సన్ కు దక్షిణ ప్రాంతాలన్నీ పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఓజోవ్ సముద్ర…
ఉత్తర కొరియా గత దశాబ్దకాలంగా రక్షణ వ్యవస్థను పటిష్టం చేసుకునేందుకు ఆయుధాలను తయారు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. సొంతంగా క్షిపణులను తయారు చేసుకుంటూ దక్షిణ కొరియా, జపాన్, అమెరికా దేశాలను భయపెడుతున్నది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఎప్పుడు ఏ క్షపణిని ప్రయోగిస్తారో తెలియక చుట్టుపక్కల దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఉత్తర కొరియా సముద్రంలోని అల్‌సామ్ దీవుల్లో ఓ పెద్ద రాయి ఉన్నది. దీనిని ఉత్తర కొరియా మోస్ట్ హేటెట్ రాక్ అని పిలుస్తారు. దీనిని టార్గెట్…
మన పొరుగుదేశం చైనా దూకుడు పెంచింది. సంప్రదాయక సైనిక శక్తిని తగ్గించుకుంటూ వచ్చినచైనా ఇప్పుడు అత్యాధునిక ఆయుధాలపై దృష్టిసారించింది. క్షిపణులు, రాకెట్లపై దృష్టి సారించింది. అణ్వాయుథాలు మోసుకెళ్లే శక్తి గత బలమైన క్షిపణులపై చేనా ప్రయోగాలు చేస్తున్నది. భారత్ సరిహద్దుల్లో నిత్యం రగడ సృష్టిస్తున్న చైనా అటు తైవాన్ ను ఆక్రమించుకోవడానికి పథకాలు రచిస్తోంది. తైవాన్ సరిహద్దుల్లో చైనా విమానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవలే హైపర్ సోనిక్ క్షిపణిని ప్రయోగించి భూమిపై తాము ఎక్కడైనా దాడులు చేయగలమని…