ప్రపంచ సుందరి కిరీటాన్ని థాయ్‌లాండ్ భామ ఒపాల్ సుచతా చువాంగ్‌శ్రీ సొంతం చేసుకుంది. మిస్ వరల్డ్ 72 విజేతగా ఒపాల్ సుచతా చువాంగ్‌శ్రీ నిలిచింది. ఒపాల్ సుచతా చువాంగ్‌శ్రీకి మిస్ వరల్డ్ కిరీటాన్ని సీఎం రేవంత్ రెడ్డి, జూలియా మోర్లీ, క్రిస్టినా పిజ్కోవా అలంకరించారు.
ప్రపంచ సుందరి-2025 పోటీలు చివరి దశకు చేరుకున్నాయి. మరికాసేపట్లో మిస్ వరల్డ్ విజేతను ప్రకటించనున్నారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో మిస్ వరల్డ్ ఫైనల్స్ అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.