రాఖీ పండగ పూట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తన సోదరితో రాఖీ కట్టించుకునేందుకు ఇంటికి వచ్చిన ఓ యువకుడిని దుండగులు హత మార్చారు. ఈ ఘటన ఫరీదాబాద్‌లోని ఆదర్శ్‌నగర్‌లో చోటు చేసుకుంది. బైక్‌పై వచ్చిన దుండగులు.. ఇంట్లోకి చొరబడి ఆర్‌ఎంపీ డాక్టర్ కొడుకును హత్య చేశారు. దీంతో ఆ ప్రాంతంలో సంచలనం నెలకొంది. మృతి చెందిన వ్యక్తి ఆర్కిటెక్ట్ చదువుతున్న అరుణ్ కుమార్ గా గుర్తించారు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్ కు చెందిన అక్కాచెల్లెళ్లు మగ్గిడి రాజవ్వ(72), గంగవ్వ(62) గత కొంతకాలంగా ఒకే ఇంట్లోనే కలిసి ఉంటున్నారు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.