విద్యార్థినులపై లైంగిక వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి.. ఉన్న ప్రాంతంలో చుట్టుపక్కలవారితో ఆడపిల్లలకు రక్షణ అనుమానంగా మారిపోయింది.. ఎక్కడికైనా వెళ్లాలన్నా.. ఎక్క ఏ కామాంధుడు ఉన్నాడో తెలియని పరిస్థితి.. తీరా చదువుకునే ప్రాంతంలోనూ వేధింపులు తప్పడంలేదు.. తాజాగా, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని నిట్‌లో కీచకపర్వం వెలుగుచూసింది. బయోటెక్నాలజీ లెక్చరర్ తమిళమణి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని… విద్యార్థినులు ఆందోళనకు దిగారు. కాలేజీ అడ్మినిస్ట్రేషన్ భవనం దగ్గర ధర్నా చేశారు. లెక్చరర్‌ను విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. దీంతో క్యాంపస్‌లో కాసేపు…