ఏపీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. రాష్ట్రంలో మిర్చి రైతులు నష్టపోతే రాష్ట్ర ప్రభుత్వం నుండి కనీస స్పందన కరువైందన్నారు. స్వయంగా ముఖ్యమంత్రే పంటల బీమా కోసం ఒక్క రూపాయి కట్టండి అని చెప్పారు. చివరికి రాష్ట్రం చెల్లించాల్సిన బీమా సొమ్ము చెల్లించలేదు.మిర్చిపై రైతులు నాలుగు వేల రూపాయల కోట్ల పెట్టుబడి పెట్టారు.
వ్యవసాయ శాఖ మంత్రి ప్రధాని మోదీ ఇచ్చిన వాటి గురించి చెప్పడు. సివిల్ సప్లయ్స్ ఛైర్మన్ గా ఉన్న ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి నాన్నను వెంటనే తొలగించాలన్నారు సోము వీర్రాజు. ఈ ప్రభుత్వానికి పంటకాలువ గురించి తెలియదు. డైరెక్టర్ స్పెషల్ గురించి తెలుసు. ఐదురాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సోము వీర్రాజు స్పందించారు. యూపీలో యోగి ఆదిత్యనాథ్ తిరిగి సీఎం కాబోతున్నారు. ఆ మీటింగ్ ఈ మీటింగ్ లంటూ తిరుగుతున్న సీఎంల కుర్చీల కింద మంట వస్తుంది. అందరికీ చెమటలు పడతాయన్నారు సోము వీర్రాజు.
బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని నిద్రలేపటానికి ధర్నా చేపట్టాం. రైతు సమస్యల పరిష్కారం కోసమే ఇక్కడికొచ్చాం.గుంటూరు పౌరుషానికి చిహ్నంగా మిర్చి సాగవుతోంది. సైనికులు ఏవిధంగా దేశానికి సేవ చేస్తున్నారో అదే విధంగా మిర్చి రైతులు సేవ చేస్తున్నారు. యువజనులను, శ్రామికులను, రైతులను ఈ ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. వైఎస్పార్ కాంగ్రెస్ లో యువజనులు, శ్రామికులు, రైతులు లేరు. ఇక కాంగ్రెస్ మాత్రమే మిగిలింది. కాంగ్రెస్ కు పట్టిన గతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పడుతుందని విమర్శించారు జీవీఎల్.