Sheikh Hasina: బంగ్లాదేశ్‌ను విడిచి వచ్చిన తర్వాత, మాజీ ప్రధాని షేక్ హసీనా తొలిసారి బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. బంగ్లాదేశ్ తాత్కాలిక పాలకుడు మహ్మద్ యూనస్‌పై ఆమె విరుచుకుపడ్డారు. యూనస్ ఒక ఫాసిస్ట్ హంతకుడిగా పేర్కొన్నారు. ఆయన పాలనలో అక్రమ, హింసాత్మక పాలన కొనసాగుతోందని విమర్శలు గుప్పించారు.