అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్ భాయ్ విమానాశ్రయం సమీపంలో జరిగిన విమాన ప్రమాదంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. అనంతరం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఘోర విమాన దుర్ఘటనను పౌర విమానయాన శాఖ అత్యంత తీవ్రంగా పరిగణిస్తోందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనాస్థలిలో సహాయచర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. గుజరాత్ ప్రభుత్వం, పౌరవిమానయాన శాఖ సంయుక్తంగా స్పందించినట్లు స్పష్టం చేశారు.
చైనా, థాయ్‌లాండ్‌తో సహా ఆరు దేశాల ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ నెగెటివ్ టెస్ట్ రిపోర్ట్ తప్పనిసరి చేయడానికి ముందు, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఇవాళ అంతర్జాతీయ విమానాలలో వచ్చే ప్రయాణీకుల కోసం సవరించిన కోవిడ్ మార్గదర్శకాలను జారీ చేసింది.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తాగి ఫ్లైట్ ఎక్కారని.. దాంతో విమాన సిబ్బంది ఆయన్ను అడ్డుకున్నారు.. విమానం నుంచి దించేశారు.. ఈ పరిణామాలతో విమానం ఆలస్యంగా బయల్దేరిందంటూ.. రకరకాల ప్రచారాలు జరిగాయి.. అయితే, దీనిపై పౌర విమానయాన శాఖ విచారణ చేపట్టింది.. జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయంలో ఢిల్లీ వెళ్లే విమానంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్.. తాగి ఉన్నారనే ఆరోపణలపై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విచారణ చేపట్టనున్నట్టు మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు.. పంజాబ్ సీఎం…
డిసెంబర్ 15 తర్వాత అంతర్జాతీయ విమాన సర్వీసులు పున: ప్రారంభం అవుతాయని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. భారతదేశానికి మరియు ఇతర దేశాలతో షెడ్యూల్ చేయబడిన వాణిజ్య అంతర్జాతీయ విమాన సేవలను పునఃప్రారంభించే విషయాన్ని, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో సంప్రదించి పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కరోనావైరస్ మహమ్మారి కారణంగా గత ఏడాది మార్చి…