ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది.. పాత మంత్రులతో జరిగిన చివరి కేబినెట్ సమావేశంలో.. అందరితో రాజీనామాలు చేయించిన సీఎం వైఎస్ జగన్.. పాత కొత్త మంత్రుల కలయికతో ఆదివారం రోజు తన కొత్త టీమ్‌ను ప్రకటించారు.. ఇక, ఇవాళ మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. 25 మంది కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది.. ప్రమాణ స్వీకార ఘట్టంలో మొదట సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రమాణ స్వీకారం…