కర్ణాటక ఎన్నికల ప్రచారంలో తెలుగు స్టార్ కమెడియన్ బ్రహ్మానందం పాల్గొన్నారు. బీజేపీ నేత, ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ తరపున ఆయన నాలుగు రోజులు చిక్ బల్లాపూర్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. అయితే అక్కడ మంత్రి సుధాకర్ ఓటమి పాలయ్యారు.
కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి కాంగ్రెస్ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగితే బాధ్యత మీదే అంటూ హెచ్చరించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని ఈడీ విచారిస్తోంది. అయితే దీనికి నిరసనగా కర్ణాటక వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలు తెలియజేస్తోంది. పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరిగితే కాంగ్రెస్ పార్టీనే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కే. సుధాకర్…