తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 317ను ఉపాధ్యాయులు, ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల వ్యతిరేక జీవో అక్రమ అరెస్టులు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని నిర్ణయించారు. అయితే తాజాగా విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బదిలీలకు నిరసన జూనియర్ లెక్చరర్లు మంత్రి సబితాఇంద్రారెడ్డి ఇంటి ముందు ఆందోలనకు దిగారు. బదిలీల్లో న్యాయం చేయాలని మంత్రి సబిత ఇంటి ముందు జూనియర్ లెక్టరర్లు బైఠాయించారు.…
తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాలపై వివాదం నేపథ్యంలో ఫస్టియర్ విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్లు ఈరోజు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇంటర్ విద్యార్థులను మంత్రి సబిత ఇంద్రారెడ్డి సున్నితంగా హెచ్చరించారు. కరోనా వైరస్ నేపథ్యంలో క్లాసులు సరిగ్గా జరగని కారణంగా విద్యార్థులు ఫెయిలయ్యాయని ఆందోళన చెందుతున్నారని.. వచ్చే ఏడాదిలో సెకండియర్ పరీక్షలు ఉన్నందున ఒత్తిడికి గురికావొద్దనే అందరినీ పాస్ చేసినట్లు సబిత వివరణ ఇచ్చారు. Read Also: ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు అందరూ పాస్ అయితే పరీక్షలు…
తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్ విద్యార్థి కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. తాను నాలుగు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యానని… ఏది రాసినా పాస్ చేస్తామని చెప్పిన అధికారులు ఇప్పుడు ఫెయిల్ చేశారని ట్విట్టర్‌లో ఆరోపించాడు. తన సూసైడ్‌కు మంత్రులు కేటీఆర్, సబితలే కారణమని వారిని ట్యాగ్ చేశాడు. దీంతో క్షణాల్లోనే ఇంటర్ విద్యార్థి చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. Read…
టీఆర్‌ఎస్‌లో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. వికారాబాద్ జిల్లా తాండూరులో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలోనే టీఆర్‌ఎస్ నేతలు మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి. దీంతో ఒక్కసారికి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి వర్గాల మధ్య గత కొన్ని రోజుల నుంచి కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ విషయం స్థానిక నేతలకు తెలిసినా వారి మధ్య సంది కుదిర్చేందుకు సహాసించలేదు. అయితే నేడు సబితా ఇంద్రారెడ్డి ముందే ఇరు వర్గాల నేతల…
తెలంగాణలో గత కొంతకాలంగా తగ్గుతూ వస్తున్న కరోనా కేసులు మళ్ళీ పడగ విప్పుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అప్రమత్తం అయింది. విద్యాసంస్థల్లో కోవిడ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అధికారులతో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష జరిపారు. విద్యార్ధులు, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఏ విద్యాసంస్థల్లో కోవిడ్ కేసులు నమోదయ్యాయో అక్కడి విద్యార్థులందరికీ స్క్రీనింగ్ చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. Read Also గురుకుల పాఠశాలలో 43 మంది విద్యార్థులకు కరోనా !…
ఇంటర్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై కీలక ఆదేశాలు ఇచ్చారు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. పరీక్షల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, ఇంటర్ విద్యా శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆమె.. ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి అయినట్టు వెల్లడించారు.. జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేశామని.. ఈ సారి నాలుగు లక్షల 58 వేల మంది విద్యార్థులు పరీక్షకు హాజరు అవుతారని వెల్లడించారు. అయితే, కరోనా నేపథ్యంలో పరీక్షా…
ఇంటర్ విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. అక్టోబర్ 25 వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే ఇంటర్ పరీక్షలకు కేవల్ 70 శాతం సిలబస్ నుంచే ప్రశ్నలు ఇస్తామని ప్రకటించింది. ఇంటర్ పరీక్షలు స్టడీ మెటీరియల్ ను ఇవాళ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఇంటర్ పరీక్షల్లో ఒత్తిడి, భయం లేకుండా ఉండేందుకే ఈ స్టడీ మెటీరియల్ ఇస్తున్నట్లు చెప్పారు.…
సమాజ నిర్మాతలు మీరే-జాతి నిర్మాణం లో భాగస్వాములు కావాలని… భవిష్యత్తు తరాలకు బంగారు బాటలు వేయాలని ఉపాధ్యాయులకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపు నిచ్చారు. విద్యార్థులకు నైతిక విలువలు,మానవీయ విలువలు నేర్పించాలని… ప్రయివేటు పాఠశాలల్లో లాగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా స్కూల్ డే లు నిర్వహిస్తామన్నారు. చిన్ననాడు పీర్ల కోటం లో చదువుకున్న, నాడు చదువు చెప్పిన ఉపాధ్యాయులు తనకెప్పటికి ఆదర్శమని వివరించారు. ఎంత ఎదిగిన గురువు ను మర్చిపోవొద్దని…గురుపూజ దినోత్సవ సందర్భంగా ఉపాధ్యాయులకు…
విద్యాసంస్థల రీ- ఓపెనింగ్‌పై తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యా సంస్థల్లో ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు కోవిడ్ ని దృష్టి లో పెట్టుకొని ఏర్పాట్లు చేశామని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. పిల్లల భవిష్యత్ ను దృష్టి లో పెట్టుకునే ప్రత్యక్ష తరగతుల ప్రారంభం చేస్తున్నామని.. ఆఫ్ లైన్ బోధనకు ఆన్లైన్ ప్రత్యామ్నాయం కాదని తెలిపారు. పిల్లలు ఆనందం తో ఉన్నారు.. తల్లి దండ్రులు కూడా పిల్లల్ని పంపేందు కు సుముఖంగా…
కరోనా మహమ్మారి కారణంగా విద్యాసంస్థలు అన్నీ మూతపడ్డాయి.. కేవలం ఆన్‌లైన్ విద్యకే పరిమితం అయ్యారు.. అయితే, తిరిగి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి విద్యాసంస్థలను ప్రారంభించేందుకు సిద్ధమైంది ప్రభుత్వం.. కేజీ నుంచి పీజీ వరకు ప్రత్యక్ష బోధన జరుగుతుందనే ఇప్పటికే సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.. ఇక, విద్యాసంస్థల ప్రారంభానికి ఇదే సరైన సమయం అన్నారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. హైదరాబాద్‌లోని మహబూబియా బాలికల పాఠశాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి ఒమర్ జలీల్, పాఠశాల విద్యా…