Srilanka Economic Crisis: శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో జూలై 9న పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. అయితే ఈ సమయంలో అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం నుంచి పారిపోయారు. జూలై 13న మాల్దీవులకు పారిపోయిన రాజపక్స.. తిరిగి అక్కడ నుంచి సింగపూర్ చేరుకున్నారు. ఇదిలా ఉంటే త్వరలోనే గొటబయ రాజపక్స స్వదేశానికి వస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అక్కడి మంత్రి, కేబినెట్ అధికార ప్రతినిధి వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి