తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన రేపల్లె రైల్వే స్టేషన్లో వివాహితపై అత్యాచార ఘటనపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని స్పందించారు. రేపల్లె రైల్వే స్టేషన్ లో మహిళపై అత్యాచార ఘటన అత్యంత బాధాకరం. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీరియస్‌గా తీసుకున్నారు. నిందితులకు కఠిన శిక్ష పడే వరకు మా ప్రభుత్వం వదిలిపెట్టం అన్నారు. పోలీసులు ఇప్పటికే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీతో, ఆస్పత్రి అధికారులతో మాట్లాడాం. బాధితురాలికి మెరుగైన వైద్యం…