కేరళలోని శబరిమల క్షేత్రంలో కొలువై ఉన్న అయ్యప్ప స్వామి.. నవంబర్ 17 (శుక్రవారం) నుంచి భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. ఈ ఏడాది శబరిమల వార్షిక వేడకలకు సిద్ధమైంది. నవంబర్ 17 నుంచి మండల మకరవిళక్కు వేడుకలు ప్రారంభం కానుండగా.. రెండు నెలలపాటు స్వామివారి మహాదర్శనం కొనసాగనుంది. అందుకు సంబంధించి కేరళ దేవాదాయశాఖ అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి రాధాకృష్ణ తెలిపారు.