ఆంధ్రప్రదేశ్‌లో రవాణా శాఖ సర్వర్ మొరాయించింది.. వచ్చే ఏడాది నుంచి రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగనున్న నేపథ్యంలో.. ఒక్కసారిగా వాహనాల రిజిస్ట్రేషన్లు పెరిగిపోయాయి.. దీంతో రవాణాశాఖ వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలు వచ్చాయి.. ఇవాళ రాత్రికి వెబ్ సైట్లో వచ్చిన సాంకేతిక సమస్యను పరిష్కరిస్తామని.. రేపు ఉదయం నుంచి వాహనాల రిజిస్ట్రేషన్లను యథాతథంగా అనుమతిస్తామని అధికారులు చెబుతున్నారు.. ఇక, ఈ వ్యవహారంపై స్పందించిన మంత్రి పేర్ని నాని.. ఏపీ రవాణా శాఖ సర్వర్ లో సాంకేతిక సమస్య తలెత్తింది.. T/R…
మచిలీపట్నం ఎం.పి. బాలశౌరి కుమారుడు అనుదీప్ వివాహం స్నికితతో రాజస్థాన్ లోని ఉదయపూర్ ప్యాలెస్ లో జరిగింది. సోమవారం తెల్లవారు ఝామున ఘనంగా జరిగిన ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ లో సినీ, రాజకీయ రంగాల ప్రముఖులతో పాటు సన్నిహితులు హాజర్యారు. రెండు రోజులు పాటు జరిగిన ఈ వేడుకలు లో భాగం ఆహుతులను అలరించాయి. ఈ వివాహానికి మెగాస్టార్ చిరంజీవి సతీ సమేతంగా హాజరై నూతన వధూవరులను ఆశ్వీరదించారు. ఇక ఈ కార్యక్రమంలో ఏపి మంత్రి పేర్ని…
మంగళవారం పంపిణీదారులు, ప్రదర్శనదారులతో సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని. ఈ సందర్భంగా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ తమ సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చినట్లు మంత్రి తెలియచేశారు. చిత్రపరిశ్రమకు సబంధించిన పలు సంఘాల నుంచి తమకు విజ్ఞాపనలు వచ్చాయని, వాటన్నింటినీ ఇటీవల ప్రభుత్వం నియమించిన కమిటీతో చర్చించి సానుకూలంగా తగిన నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు కూడా రేటు పెంచరా అని అడిగిన ప్రశ్నకు గత ప్రభుత్వంలా బామ్మర్దికి ఓ రూల్…
గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో టికెట్ల రేటు విషయమై వాదనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ రేటు తగ్గించిన తరుణంలో హీరో నాని కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాడు. థియటర్ల కంటే పక్కనే ఉన్న కిరాణాకొట్టుకు ఎక్కువ ఆదాయం వస్తుంది అని నాని చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఇక నానితో పాటు హీరో సిద్దార్థ్ సైతం ట్విట్టర్ లో తన…
ఏపీలో ప్రస్తుతం సినిమా టికెట్ల ధరలు, సినిమా థియేటర్ల మూసివేత హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో నేడు సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో సినిమా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు సమావేశమయ్యారు. సుమారు గంటన్నర పాటు మంత్రి పేర్ని నానితో టికెట్ల ధరలు, థియేటర్ల మూసివేతపై చర్చించి వారి ప్రతిపాదనలు అందించారు. సమావేశం అనంతరం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. సినిమా హాళ్లలో వసతులు మెరుగుపర్చాలని గతంలోనే చెప్పామని, సమయం ఇచ్చినా మార్పు లేకపోవడంతోనే తనిఖీలు చేశామన్నారు.…
ఏపీ బీజేపీపై మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, చంద్రబాబు ఎజెండానే బీజేపీ ఎజెండా అని ఆయన ఆరోపించారు. బీజేపీ నాయకులు ఏపీలో బ్రాందీ ధరలు పెరిగినందుకు బాధపడుతున్నారని, వారు బాధపడాల్సింది డిజీల్, పెట్రోల్ ధరలు పెరిగినందుకు అని ఆయన మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకముందు పెట్రోల్, డిజీల్ ధరలు ఇప్పటి ధరలు పరిశీలించాలన్నారు. అంతేకాకుండా సుజనా చౌదరి, సీఎం రమేష్‌లకు బీజేపీ పార్టీని లీజుకు ఇచ్చారని,…
ఏపీలో సినిమా టికెట్ల ధరల విషయం ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే టికెట్ల ధరలపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లలో రెవెన్యూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా ఉన్న సినిమా థియేటర్లను సీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో నేడు సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి పేర్ని నాని సినిమా టికెట్ల ధరల వ్యవహారంపై మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రెస్ మీట్ ప్రత్యక్ష ప్రసారం వీక్షించేందుకు క్రింద…
ఏపీ టికెట్ల ధరల తగ్గింపు విషయం చినికిచినికి గాలివానలా తయారైంది. ప్రస్తుతం ఏపీలో సినిమా టికెట్ల ధరల తగ్గింపు, సినిమా థియేటర్లు మూసివేత పరిణామాలతో హాట్ టాపిక్‌గా మారింది. ఏపీ ప్రభుత్వం జీవో 35 ప్రవేశపెట్టి సినిమా టికెట్ల ధరలు అన్ని సినిమాలకు ఒకే విధంగా ఉండేలా నిర్ణయం తీసుకుంది. దీంతో పలువురు నిర్మాతలు, ఎగ్జిబిటర్లు ప్రభుత్వం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వం ప్రవేశపెట్టి జీవో 35ను రద్దు…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చల దిశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు టాలీవుడ్ పెద్దలు.. మంత్రి పేర్నినానిని కలిసి చర్చలు జరపాలని భావిస్తున్నారు. రేపు సినీ ప్రముఖుల బృందం.. మంత్రి పేర్నినానితో సమావేశం అయ్యే అవకాశం ఉంది.. కాగా, గత కొన్ని రోజులుగా ఏపీలో సినిమా థియేటర్లపై అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కొన్ని థియేటర్లను ఇప్పటికే మూసివేశారు. టికెట్ రేట్లు తక్కువగా ఉంటే.. సినిమా థియేటర్లను నడపలేమంటూ.. మరికొందరు స్వచ్ఛందంగా సినిమా థియేటర్లను మూసివేస్తున్నారు. దాంతో..…
ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు తర్వాతే హైదరాబాద్ భౌగోళిక స్వరూపం మారిపోయింది. నగర విస్తరణ, అభివృద్ధికి ఔటర్ రింగ్ రోడ్డు అవసరం అని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి అన్నారు. అమరావతి రాజధాని, దాని చుట్టూ వున్న విజయవాడ,గుంటూరును కలుపుతూ 189కి.మీ ఔటర్ రింగ్ రోడ్డు రూపకల్పన జరిగింది. 17761కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి కేంద్రం ఆమోదించింది. అటువంటి ప్రాజెక్ట్ ను వైసీపీ ప్రభుత్వం అటకెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓఆర్ఆర్ ను మంగళం పడేశారని కేంద్ర మంత్రి నీతిని…