కరోనా మహమ్మారి తగ్గేదేలే అంటోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా కేసులు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ వెలుగులోకి రాక ముందు కరోనా కేసులు భారత్ లో తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. అయితే భారత్ లో ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. అయితే కరోనా సెకండ్ వేవ్ లో వ్యాప్తి చెందిన డెల్టా వేరియంట్ కంటే.. థర్డ్ వేవ్ లో వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ వేరియంట్ శరవేగంగా ఉంది. దీంతో…
ఏపీలో పీఆర్సీ ప్రకటన హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవోలు ఉద్యోగులకు ఆమోదయోగ్యంగా లేవంటూ ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ సంఘాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి సమ్మె సైరన్ మోగించేందుకు అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. ఉద్యోగులు ఎవరి ప్రోద్బలంతో నో, భావోద్వేగంతోనో కాకుండా సంయమనంతో ఆలోచించాలని కోరుకుంటున్నామన్నారు. ఉద్యోగుల పట్ల సానుభూతి ఉండటం వల్లే అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే 27…
టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ నిత్యం సోషల్ మీడియాలో కనిపించకపోయినా అవసరమైన సమయంలో అవసరమైన విషయాలపై తనదైన స్పందన తెలియజేస్తూ ఉంటారు. తన సినిమా అప్డేట్స్ తో పాటు కొన్ని సమస్యలపైకూడా ఆయన తన గొంతును వినిపిస్తారు. ఇక తాజాగా హరీష్ వేసిన ట్వీట్ నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. ఊసుపోక.. అలోచించి వేసిన ట్వీట్ అని ఆయన చెప్పుకొస్తున్నా.. అది ఎవరికో స్ట్రాంగ్ కౌంటర్ అని నెటిజన్లు నొక్కి వక్కాణిస్తున్నారు. ” ఒక్క సారి క్యాచ్ ఇచ్చాక…
టాలీవుడ్‌లో నెలకొన్ని సినిమా టిక్కెట్ ధరలపై మంత్రి పేర్ని నానితో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సోమవారం మధ్యాహ్నం సమావేశమయ్యారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 1955 సినిమాటోగ్రఫీ చట్ట ప్రకారమే సినిమా టిక్కెట్ ధరలు ఉన్నాయని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. 1955 నుంచి అదే జరుగుతోందని… తాము కొత్తగా సృష్టించిందేమీ లేదన్నారు. రామ్‌గోపాల్ వర్మ తాను చెప్పాల్సింది చెప్పారని.. అన్నీ వివరంగా విన్నానని తెలిపారు.…
ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు వీరి సమావేశం జరిగింది. అనంతరం ఆర్జీవీ మీడియాతో మాట్లాడుతూ… మంత్రి పేర్ని నానితో చర్చలు సంతృప్తికరంగా ముగిశాయన్నారు. సినిమా టిక్కెట్ రేట్లపై తన అభిప్రాయాన్ని ప్రభుత్వానికి చెప్పానని… ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నట్లు రామ్‌గోపాల్ వర్మ తెలిపారు. Read Also: ప్రభాస్… హాలీవుడ్ హీరో అనిపించుకుంటాడా? సినిమా టిక్కెట్ల రేట్లు తగ్గిస్తే సినిమా క్వాలిటీ…
ఏపీలో సినిమా టికెట్ల ధరలపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం జీవో నెం 35ను ప్రవేశపెట్టి సినిమా టికెట్ల ధరలు నిర్ణయించి ఆ ధరలకంటే ఎక్కువకు అమ్మకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పలువురు నిర్మాతలు, ఎగ్జిబిటర్లు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవోను రద్దు చేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేయడంతో మరోసారి హైకోర్టు ఏపీ సినిమా టికెట్లపై…
టాలీవుడ్ సినీ ప్రముఖులకు, ఏపీ ప్రభుత్వానికి మధ్య టికెట్ రేట్ల విషయమై మాటల యుద్ధం జరుగుతున్నా సంగతి తెలిసిందే. ఇక ఇప్పటివరకు ఒక లెక్క.. ఇప్పటినుంచి ఒక లెక్క అన్న చందానా ఈ ఇష్యూలోకి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎంటరయ్యి.. టాలీవుడ్ తరుపున తన ప్రశ్నలను ప్రభుత్వానికి వినిపిస్తున్నాడు. రెండు రోజుల నుంచి ఆర్జీవీ ప్రశ్నలకు అంతు లేదు. ప్రశ్నలతో ట్వీట్ల వర్షం కురిపిస్తున్నాడు. వర్మ ట్వీట్లకు ఏపీ మంత్రి పేర్ని నాని సమాధానాలు…
ఏపీలో సినిమా టికెట్ల ధరల అంశం రోజురోజుకు ముదురుతోంది. ఇప్పటికే ప్రభుత్వం చెప్పిన ధరలకు సినిమాలు ప్రదర్శించలేమని థియేటర్ల యజమానులు సినిమా హాళ్లను మూసివేశారు. ఓ వైపు ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతుండడంతో పలు రాష్ట్రాల్లో ఆంక్షలు విధించడంతో సంక్రాంతి పండుగగకు విడుదల కావాల్సిన భారీ బడ్జెట్ సినిమాలు కూడా వాయిదా పడ్డాయి. అయితే ఈ తాజాగా వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండే దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (ఆర్జీవీ) ఏపీలో టికెట్ల ధరలపై స్పందించారు. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి…
టాలీవుడ్ లో ప్రస్తుతం ఏపీ టికెట్ రేట్స్ ఇష్యూ ఎంతటి సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పలువురు ప్రముఖులు ఈ విషయమై తమ స్పందన తెలియజేస్తున్నారు. మరికొంతమంది మౌనం వహిస్తున్నారు. దీంతో ఈ విషయమై మాట్లాడే పెద్ద దిక్కు ఎవరు లేరా..? అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇక తాజాగా ఈ విషయమై వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రశ్నించడం ప్రస్తుతం సంచలనంగా మారింది. సినిమా టికెట్ల ధరల అంశంపై ఆర్జీవీ అడిగిన ప్రశ్నలు…
ఏపీలో సినిమా టికెట్ల ధరల అంశం ఇంకా సర్థుమనగడం లేదు. అయితే తాజాగా ఏపీ టికెట్ల ధరలపై సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. కన్జ్యూమర్ రైట్స్ ప్రొటక్షన్‌కు కూడా ఫోరం ఉందని ఆయన అన్నారు. ప్రోమోలు రిలీజ్ చేసి బ్రహ్మాండంగా ఉందని చెబుతున్నారు. సినిమాటోగ్రఫీ చట్టం ఒకటి ఉందని, రేట్లు, సమయాలు కంట్రోల్ చేయాలని ఉందనే విషయం తెలుసా అని ఆయన ప్రశ్నించారు. జగనో, నేనో వచ్చాక పెట్టిన నిబంధనలు కావని, సినిమా రేట్లు ఫిక్స్…