కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన అగ్రిపథ్ స్కీంపై నిరసనజ్వాలలు దేశవ్యాప్తంగా రగులుతున్నాయి. అయితే నిన్న అగ్రిపథ్ స్కీంను వ్యతిరేకిస్తూ సుమారు 2000 మంది ఆందోళన కారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను ముట్టడించి, దాదాపు 8 రైళ్లను ధ్వంసం చేశారు. అంతేకాకుండా రైల్వే స్టేషన్‌లోని ఇతర సామాగ్రిని సైతం చెల్లాచెదురు చేశారు. మొత్తం 20 కోట్ల వరకు అస్తినష్టం వాటిల్లిందని రైల్వే పోలీసులు వెల్లడించారు. అయితే తాజాగా ఈ ఘటనపై తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. మోదీ…
ధాన్యం కొనుగోళ్లు ఈ నెలఖారులోగా పూర్తి చేయాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. బుధవారం నిర్మల్ జిల్లాలోని అంబేద్కర్ భవన్‌లో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాల్లో 185 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. అంతేకాకుండా జిల్లాలో మొత్తం 43 రైస్ మిల్లులు ఉండగా.. అందులో 10 బాయిల్డ్.. 33 రా…
ఢిల్లీలో జరిగిన న్యాయసదస్సులో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 24 నుంచి 42 కు పెంచింనందుకు సీజే కు కృతజ్నతలు తెలిపారు. రాష్ట్ర హైకోర్టులో గతంలో 12 మంది న్యాయమూర్తుల ఉండగా కొత్తగా 17 మంది న్యాయమూర్తులను నియమించి, సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కేసుల సత్వర పరిష్కారానికి మార్గం చూపారన్నారు. ప్రస్తుతం 29 మంది న్యాయమూర్తులు తెలంగాణ హైకోర్టులో విధులు నిర్వహిస్తున్నారంటే సీజే…
భద్రాచలంలో రాములోరి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిపేందుకు ఆలయ అధికారులు, అర్చకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీ సీతారామ కళ్యాణం కొద్ది సేపట్లో ప్రారంభం కానున్నది. రెండేళ్ల తరువాత కరోనా అనంతరం జరుగుతున్న కల్యాణ మహోత్సవం చూసేందుకు భక్తులు తరలి వస్తున్నారు. మిథిలా స్టేడియంను ఇప్పటికే పోలీస్ యంత్రాంగం తన చేతుల్లోకి తీసుకుంది.. ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల నుంచి పోలీసులను రప్పించారు. దేవాదాయశాఖ మంత్రి…
హైదారాబాద్ కార్పోరేట్ ఆసుపత్రులలో ఎలాంటి వైద్య సేవలు, సౌకర్యాలు ఉన్నాయో అవే ఆదిలాబాద్ లో అందుబాటులో కి తెచ్చామని మంత్రి హరీశ్ రావు అన్నారు. శుక్రవారం ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ.. ప్రాథమిక వైద్యాన్ని బలోపేతం చేస్తున్నామని వెల్లడించారు. గత పరిస్థితులు మారాయని, ఇప్పుడు వైద్యులు అన్ని చోట్లకు వస్తున్నారని ఆయన అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్యం అందించేందుకు ప్రత్యేక దృష్టిసారించామని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా దేశంలోనే వైద్యం అందించడంలో తెలంగాణ నంబర్ వన్ స్థానం సాధించడం కోసం…
నిర్మల్ జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ నగర్ కాలనీకి చెందిన ఓ మైనర్ బాలికపై అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ సాజిద్ ఖాన్ అఘాయిత్యానికి ఒడిగట్టాడు.. ఈక్రమంలోనే బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మైనర్ బాలికపై గత కొన్ని రోజుల నుంచి సాజిద్ అత్యాచారానికి పాల్పడుతున్నట్లుగా సమాచారం.. ఆమెను బెదిరించి ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి అఘాయిత్యాలకు ఒడిగట్టేవాడని తెలిసింది.. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో…