ఎప్పుడూ రాజకీయాలు.. ఎన్నికలు.. ఆర్థిక మంత్రిత్వ శాఖ లెక్కలే కాదు కాస్త ఆటలు కూడా ఆడాలంటున్నారు మంత్రి హరీష్ రావు. పైగా ఆయనిప్పుడు వైద్యారోగ్యశాఖ మంత్రి కూడా ఫిట్ గా వుండడానికి క్రికెట్ ఆడారు. బ్యాట్ పట్టుకుని కొద్దిసేపు మెరుపులు మెరిపించారు. గతంలోనూ ఆటవిడుపుగా క్రికెట్ ఆడిన సందర్భాలున్నాయి. రాష్ట్రంలో వైద్యారోగ్యశాఖను గాడిన పెట్టే పనిలో బిజీగా వున్న హరీష్ రావు క్రికెట్ ఆడడం ద్వారా సరదాగా గడిపారు.
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు కాకరేపుతున్నాయి. మెజారిటీ స్థానాల్లో అధికార పార్టీ హవా కొనసాగినా, ఒకటి రెండుచోట్ల రచ్చ జరుగుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో గోనే ప్రకాశ్ రావు మీడియా సమావేశం నిర్వహించడం హాట్ టాపిక్ అవుతోంది. ఆదిలాబాద్ లో నామినేషన్ల ఉపసంహరణ పై హోంమంత్రి అమిత్ షా కు ఫిర్యాదుచేస్తానన్నారు గోనె. నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించిన సీసీ పుటేజీ ఇవ్వాలని కలెక్టర్ సిక్తాపట్నాయక్ ని కోరారు. సమాచార హక్కు చట్టం క్రింద నామినేషన్లు ఉపసంహరణకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని…
ధాన్యం కొనాలంటూ మెదక్ జిల్లా అల్లాదుర్గంలో జాతీయ రహదారిపై రైతుల ఆందోళనకు దిగారు.ఆ దారిలో వెళుతున్న ఆర్థిక మంత్రి హరీష్ రావు రైతులతో మాట్లాడారు. రైతుల దగ్గరినుంచే అధికారులకు ఫోన్ చేశారు. కొనుగోలు కేంద్రాల వల్ల నిల్వ వుంచిన ధాన్యాన్ని కొంటామని రైతులకు హామీ ఇచ్చారు మంత్రి హరీష్ రావు. రైతులను ఇబ్బంది పెట్టకుండా ధాన్యాన్ని కొనాలని అధికారులను ఆదేశించారు మంత్రి. ఈ హామీతో ఆందోళన విరమించారు రైతులు. అంతుకుముందు ధాన్యాన్ని రోడ్డుపై పోసి నిప్పంటించారు. దీంతో…
హుజురాబాద్ లో పోలింగ్ ముగిసిన తరువాత అక్కడి నుండి స్ట్రాంగ్ రూమ్ కి బయలుదేరిన బస్ లు మార్గం మధ్యలో ఒక టీఆర్‌ఎస్ నాయకుడి హోటల్ ముందు ఎలా ఆపుతారని ప్రశ్నించారు బీజేపీ ఉపాధ్యక్షురాలు డీకె అరుణ. బస్ రిపేర్ అయ్యిందని చెప్పి ఈవీఎం బాక్స్ లను మార్చినట్టు వీడియోలను చూసామని, వీవీ ప్యాట్ బయటికి ఎలా వచ్చిందని ఆమె ప్రశ్నించారు. పూర్తి భద్రత తో ఈవీఎంలు తరలించాలి. కానీ పోలీస్ లు లేకుండా ఎలా ఈవీఎంలను…
గజ్వేల్ లో సిఎం కేసిఆర్ కాలు పెట్టడం చాలా అదృష్టమని మంత్రి హరీష్ రావు అన్నారు. 7 కోట్ల 80 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన మున్సిపల్ కార్యాలయాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కెసిఆర్ ప్రాతినిధ్యంతో గజ్వేల్ దశ, దిశ మారిందని..గజ్వేల్ ప్రజలు కలలో కూడా ఊహించనంత అభివృద్ధి జరిగిందన్నారు. కసికడు నీళ్ల కోసం ఇబ్బంది పడ్డ గజ్వేల్ కు కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జలాలను తెచ్చి…
దేశంలో ప్రజలందరికీ ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని త్వరగా చేపట్టి ప్రాణాలు కాపాడాలని జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు కోరారు. అవసరాల తగినంతగా దేశీయంగా కోవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తి కావడం లేదని, దేశ అవసరాల మేరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకోని అయినా ప్రణాళికాబద్ధంగా, వేగంగా ప్రజలకు అందించాలని సూచించారు. మూడో విడత కోవిడ్ ఉధృతి వస్తుందన్న శాస్త్రవేత్తల హెచ్చరిక నేపథ్యంలో కేంద్రం వ్యాక్సినేషన్ కార్యక్రమం త్వరగా చేపట్టాలన్నారు. కోవిడ్ 19 చికిత్స కు…
ముఖ్యమంత్రి కేసీఆర్ హరిత తెలంగాణ స్వప్నం సాకారం కోసం.. రాష్ట్రంలో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంకల్పం గొప్పదని హరీశ్ రావు అన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా మంత్రి హరీశ్ రావు సిద్దిపేటలో మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి ప్రకోపిస్తే అల్లకల్లోలమే జరుగుతుందనీ, దాన్ని నివారించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచుతూ పర్యావరణాన్ని పరిరక్షించడం మన అందరి బాధ్యత అని పేర్కొన్నారు.…
ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు టీకా సేకరణ, డ్రైవర్లకు వ్యాక్సినేషన్ పై ఆర్ధిక శాఖామాత్యులు హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సోమవారం బి.ఆర్.కె.ఆర్ భవన్‌లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 2021 జూన్ 3వ తేదీ నుండి రాష్ట్రంలోని అందరు ఆర్టీసీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు మరియు మాక్సి క్యాబ్ డ్రైవర్లకు వ్యాక్సిన్ అందించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. జి.హెచ్.ఎం.సి ప్రాంతంతో పాటు ఇతర జిల్లా ప్రధాన కేంద్రాలతో కలిపి రోజుకు…
సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తామని..క్యాడర్ అంతా టీఆర్ఎస్ తోనే ఉన్నారని హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండల ప్రజాప్రతినిధుల స్పష్టం చేశారు. ఇవాళ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ లతో కమలాపూర్ మండల నాయకుల భేటీ అయ్యారు. ఈ సందర్బంగా కమలాపూర్ మండల ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలోనే పనిచేస్తామని హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం…