ఒంగోలులో టీడీపీ మహానాడు భారీస్థాయిలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ మహానాడుపై మంత్రి గుమ్మనూరు జయరాం విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు వయసు అయిపోయిందని.. ఆయనకు మతి భ్రమించిందని ఎన్టీవీతో మాట్లాడుతూ ఆరోపించారు. వరుణ దేవుడి ఆశీస్సులు రాజశేఖర్ కుటుంబానికి ఉంటాయని చెప్పటానికి కురుస్తున్న వర్షాలే ప్రత్యక్ష ఉదాహరణ అని మంత్రి జయరాం అభిప్రాయపడ్డారు. వైసీపీ చేపట్టిన సామాజిక న్యాయభేరీ బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అన్ని వర్గాలకు పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా సీఎం…