వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించే ప్రసక్తే లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. మండలి ప్రశ్నోత్తరాల సమయంలో దీనిపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడారు. గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల కారణంగా విద్యుత్ రంగ సంస్థలపై సుమారు రూ. 1.29 లక్షల కోట్ల భారం పడిందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు కుమార్తె వివాహంలో రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళిశాఖ మంత్రి ఎస్.సవిత పాల్గొన్నారు. శనివారం హైదరాబాద్ లోని సిటాడెల్ కన్వెన్షన్ సెంటర్ లో శనివారం జరిగిన ఈ వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులు గాయత్రి సొనాక్షి, రుత్విక్ సాయిని మంత్రి సవిత ఆశీర్వదించారు.
Minister Gottipaati Ravi Kumar: విద్యుత్ రంగంలో గత ప్రభుత్వంలో చేసిన పాపాలే నేడు రాష్ట్ర ప్రజల పాలిట ఉరితాళ్లు అయ్యాయని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మండిపడ్డారు. గత ఐదేళ్లలో తీసుకున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా ప్రస్తుతం ప్రజల మీద విద్యుత్ చార్జీల భారం పడుతోందని అన్నారు. ప్రజల సొమ్మును అప్పనంగా తన అస్మదీయులకు దోచిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు గానూ గతంలో చేసిన పీపీఏలను జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే రద్దు చేసినట్లు…