మంత్రి ధర్మాన ప్రసాదరావు రూటే సపరేటు.. గత కొద్దికాలంగా మంత్రి ధర్మాన ప్రసాదరావు తన వ్యవహార శైలితో, డైలాగ్స్ తో అందరినీ ఆకట్టుకుంటున్నారు. వెరైటీ డైలాగులతో విపక్షాలపై ఆయన విరుచుకుపడుతున్నారు. తాజాగా ఆయన చేసిన హంగమా అంతా ఇంతా కాదు. శ్రీకాకుళంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు హాట్ కామెంట్స్ చేశారు. టీడీపీ హయాంలో సంక్షేమ పథకాలకు లంచం డబ్బులు అడిగేవారు. నేడు తాము ఎక్కడా అవినీతికి పాల్పడడంలేదు. సినిమాల్లో హీరోలు, విలన్లు తొడగొట్టి సవాళ్ళు విసురుకున్నట్టుగా తొడగొట్టి మీసం మెలేసి సవాలు విసిరారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.
Read Also: Congress: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీలపై సీబీఐకి కాంగ్రెస్ ఫిర్యాదు
సంక్షేమ పథకాలలో అవినీతి జరొగిందని నిరూపించగలరా.?మత్యకారులు ఎన్నో మార్పులు చేశాం గతంలో ఇలాగే ఉండేదా మత్యకారులు పరిస్థితి..మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిస్తేనే పథకాలు కొనసాగుతాయి. టీడీపీ వస్తే ఉండవు….చంద్రబాబుని నమ్మేతే మీరు మోస పోయినట్లే . మేము చెబుతున్నాము ప్రజలు నుంచి ఒక రూపాయి తీసుకోలేదు అన్నారు ధర్మాన. జెండాతో చొక్కాతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు అందించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఎన్టీ రామారావు చనిపోవడానికి కారణం చంద్రబాబు కదా. ఎన్టీఆర్ కుటుంబం ఈ రోజుకి అదే బాధతో కదా ఉన్నారు.ఎన్టీరామారావు ఎందుకు పదవి కోల్పోయాడు. రాజకీయంగా ఎవరు చంపేసారు.? ఎన్టీఆర్ రామారావ్ కుటుంబం అలా అయిపోవడానికి కారణం ఎవరనే విషయం ఎన్టీఅర్ ఆనాడే చెప్పారన్నారు ధర్మాన.
Read Also: Nani: ధరణి రాకతో దద్దరిల్లిన తెలుగు ఇండియన్ ఐడల్ స్టేజ్!