యనమల ప్రకటనలో ఏ ఒక్కటీ వాస్తవం ఉండదు అని ఫైర్ అయ్యారు మంత్రి బుగ్గన.. ఏది అనుకూలంగా ఉంటే.. యనమల దానినే తీసుకుంటారు.. గతంలో ఎంతో ధనాన్ని మూటగట్టి.. ఈ ప్రభుత్వానికి ఇచ్చినట్టు మాట్లాడుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు
మంత్రి బొత్స సత్యనారాయణతో సీపీఎస్ ఉద్యోగుల చర్చలు ముగిశాయి. ప్రభుత్వంతో చర్చలు విఫలమయ్యాయని సీపీఎస్ ఉద్యోగులు వెల్లడించారు. చాలా ఆశలతో చర్చలకు వచ్చిన తమకు సర్కారు పాత విషయాలనే చెప్పిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ప్రభుత్వం జీపీఎస్‌పైనే చర్చించాలని చెప్పిందని ఉద్యోగులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్, కాగ్ నివేదిక ఆధారంగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన ఆరోపణలపై కౌంటర్ ఎటాక్‌కు దిగారు ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. కాగ్ నివేదిక ఆధారంగా యనమల చేసిన విమర్శలను తిప్పిగొట్టిన ఆయన.. వివిధ పద్దుల్లో అవకతవకలున్నాయని యనమల విమర్శించడం అన్యాయం అన్నారు.. రూ.48 వేల కోట్ల అవినీతి అంటూ యనుమల అర్ధం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డ ఆయన.. నిధుల వినియోగం పై కాగ్ అడిగిన అభ్యంతరాలకు…
ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్‌సీ ఏపీలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. సీఎస్ కమిటీ ఇచ్చిన పీఆర్‌సీ నివేదక ఆమోద యోగ్యంగా లేదంటూ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు నిరసనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన్న రాజేందర్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలతో చర్చలు జరుపుతున్నారు. అయితే ఈ చర్చల నుంచి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్య…
పీఆర్‌ఎస్‌తో పాటు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు నిరసనలకు దిగారు. అయితే ఇటీవల సీఎస్ సమీర్ శర్మ కమిటీ పీఆర్‌సీపై నివేదికను సీఎం జగన్‌కు అందజేసింది. అయితే సీఎస్ కమిటీ ఫిట్‌మెంట్ 14.29 ఇవ్వాలని నివేదికలో పేర్కొంది. దీనిపై అసంతృప్తితో ఉన్న ఉద్యోగ సంఘాలతో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేందర్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చర్చలు జరుపుతున్నారు. అయితే సీఎస్ కమిటీ సిఫార్సు మేరకు 14.29 శాతం ఫిట్‌మెంట్‌కు…
ఏపీలోని జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ శాసనమండలి రద్దును వెనక్కి తీసుకుంటూ మంగళవారం మధ్యాహ్నం ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ మేరకు అసెంబ్లీలో మండలి రద్దు తీర్మానాన్ని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశపెట్టారు. గత ఏడాది జనవరి 27న మండలి రద్దు చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేసింది. దీంతో గత 22 నెలలుగా ఈ తీర్మానం కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది. ఇప్పటివరకు కేంద్రం నిర్ణయం రాకపోవడంతో తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని…
ఏపీ శాసన మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే మండలి సమావేశాలు ప్రారంభంలోనే ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండలి ముందుకు 3 రాజధానుల చట్ట ఉపసంహరణ బిల్లు ప్రవేశపెట్టారు. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు రద్దుపై మండలిలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బుగ్గన మాట్లాడుతూ.. అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితేనే వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని భావించామన్నారు. పబ్లిక్ సెక్టార్ కంపెనీలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌లోనే పెట్టారని అన్నారు. మిగితా రాష్ట్రాలు బీహెచ్‌ఈఎల్, బీడీఎల్ వంటి సెక్టార్లను…
తాడేపల్లిగూడెంలోని సీఎం క్యాంపు కార్యాలయంలో స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశం సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు బుగ్గన రాజేందర్, బొత్స సత్యనారాయణ, గౌతం రెడ్డి, కృష్ణదాస్, బాలినేని, కన్న బాబులతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కొత్తగా 5 పరిశ్రమలకు ఎస్‌ఐపీబీ గ్నీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించారు. అయితే రూ.2,134 కోట్లతో 5 పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో 7,683 మంది…