ఏపీలో వైద్యరంగం అభివృద్ధికి చేపట్టిన చర్యలను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన బడ్జెట్ ప్రసంగంలో వివరించారు. వైద్యారోగ్య రంగంలో నాడు నేడు పథకం అమలు చేశామని మంత్రి తెలిపారు. ఉప ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాసుపత్రుల వరకూ 16,852 కోట్లు వ్యయం చేశామని ఆయన వెల్లడించారు. ఫ్యామిలీ డాక్టర్ అనే వినూత్న కార్యక్రమం ద్వారా ప్రజలకు అందుబాటులో వైద్యం తెచ్చామని మంత్రి పేర్కొన్నారు.
బడ్జెట్‌లో సంక్షేమానికే పెద్ద పీట వేస్తున్నామని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ స్పష్టం చేశారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథం గా భావించిన రాజకీయ పార్టీ వైసీపీ, రాజకీయ నాయకుడు జగన్ అని మంత్రి వెల్లడించారు. 99 శాతం హామీలను శాచ్యురేషన్ పద్ధతిలో అమలు చేశామన్నారు.