భారతదేశంలోని మహిళలు చీరకట్టు అంటే ఎంతో ఇష్టం. అది మన సంప్రదాయానికి సూచిక కూడా. అయితే కేరళలో చీరకట్టు అంశం వివాదం రేపుతోంది. ఆ రాష్ట్రంలో మహిళా టీచర్లు తప్పనిసరిగా ప్రతి రోజు చీర ధరించాల్సిందే అంటూ విద్యాసంస్థల యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయని పలువురు టీచర్లు కేరళ విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై విద్యాశాఖ మంత్రి ఆర్ బిందు స్పందించారు. టీచర్లు తప్పనిసరిగా చీరలు ధరించాలనే పద్ధతి సరికాదని పేర్కొన్నారు. మహిళలు ఎలాంటి దుస్తులు ధరించాలో ఆడవారి…