ఇసుకతో పాటు ఇతర ఖనిజాల అక్రమ తవ్వకాలు, అక్రమ సరఫరాపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. గనుల శాఖపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష చేపట్టారు.
ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఏ విధంగా సరఫరా చేయాలనే దానిపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అధ్యయన కమిటీ సభ్యులుగా రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్. శ్రీధర్, ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్స్ కమిషనర్ శశాంక, టీజీ ఎండీసీ మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్ కుమార్‌లను నియమించారు.
ఏపీలో సిలికా శాండ్ ఈ ఆక్షన్ (E-Auction) నిర్వహించింది ప్రభుత్వం. దీనికి అనూహ్య స్పందన లభించింది. నెల్లూరు జిల్లాలో సిలికాశాండ్ ఈ- ఆక్షన్ కు రికార్డు స్థాయిలో బిడ్ (Bid) దాఖలయింది. చిల్లకూర్ మండలంలోని తూర్పు కానుపూర్ గ్రామ పరిధిలోని ఆరు హెక్టార్లల్లోని సిలికా శాండ్ కి ఈ-ఆక్షన్ నిర్వహించారు. రూ.1.60 కోట్లతో ప్రారంభమైంది ఈ-ఆక్షన్. ఇందులో అత్యధికంగా రూ. 3.16 కోట్లు కోట్ చేసి బిడ్ దక్కించుకుంది స్మార్కో ఇండస్ట్రీస్. గ్లాస్ ఆధారిత పరిశ్రమలో కీలక…