South Africa: దక్షిణాఫ్రికా ప్లాటినం గనిలో భారీ ప్రమాదం జరిగింది. గనిలోకి కార్మికులను తీసుకెళ్తున్న ఎలివేటర్ ఒక్కసారి కూలిపోయింది. దీంతో కార్మికులు ఒక్కసారిగా 200 మీటర్లు కిందకి పడిపోయారు. ఈ ప్రమాదంలో 11 మంది మరణించగా.. 75 మంది గాయపడ్డారని అక్కడి అధికారులు మంగళవారం తెలిపారు. దేశంలోని ఉత్తర ప్రాంతంలో ఉన్న రస్టెన్‌బర్గ్ నగరంలోని గనిలో కార్మికులు విధులు ముగించుకుని బయటకు వస్తున్న క్రమంలో సోమవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది.