సరిహద్దుల్లో ఉన్న ప్రతి దేశంతో చెలగాటమాడుతున్న చైనా.. ఇప్పుడు తన భద్రతపై పెద్ద ఎత్తున ఆందోళన చెందుతోంది. చైనా తన చర్యల కారణంగా అనేక దేశాలు ఏకమై కూటమిగా ఏర్పడితే.. తమకు వ్యతిరేకంగా చైనా నిలబడటం కష్టసాధ్యమని చైనా భావిస్తోంది.
ఇజ్రాయెల్ దళాలు గాజాలో హమాస్ పై దాడులు చేస్తున్న భాగంలో.. హెజ్ బొల్లా., గాజాకు మద్దతుగా ఇజ్రాయెల్ పై దాడులు చేస్తోంది. దింతో హెజ్ బొల్లా పై ప్రతీకారంగా ఇజ్రాయెల్ దళాలు కూడా దాడులు చేస్తున్నాయి. ఇకపోతే., మరోసారి ఇజ్రాయెల్ దళాలు ఆ హెజ్ బొల్లా మిలిటెంట్ గ్రూప్ పై త్రీవ స్థాయిలో విరుచుకుపడ్డాయి. దాంతో ఇజ్రాయెల్ దళాలు బుధవారం నాడు సిరియాపై భారీగా దాడులు నిర్వహించాయి. ఇందులో భాగంగా సిరియా కేంద్రంగా పనిచేస్తున్న లెబనాన్ కు…
Maldives : కొద్ది రోజుల క్రితమే మాల్దీవులకు ఉచితంగా సైనిక సహాయం అందించేందుకు రక్షణ సహకార ఒప్పందంపై చైనా సంతకం చేసింది. మాల్దీవులు కొన్ని నిర్దిష్ట ప్రాంతాల్లో గస్తీ కోసం టర్కీ నుండి డ్రోన్‌లను కొనుగోలు చేసింది.
World Defence Expo : సౌదీ అరేబియాలోని రియాద్‌లో వరల్డ్ డిఫెన్స్ ఎక్స్‌పో ప్రారంభమైంది. క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ తరపున సౌదీ రక్షణ మంత్రి ప్రిన్స్ ఖలీద్ బిన్ సల్మాన్ ఆదివారం ఈ వరల్డ్ డిఫెన్స్ ఎక్స్‌పోను ప్రారంభించారు.
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ లడఖ్‌లో పర్యటిస్తున్నారు. గురువారం (ఆగస్టు 24) నాటి తన పర్యటనకు సంబంధించిన అనేక ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. అందులో అతను కార్గిల్‌లోని సైనిక సిబ్బందితో కలిసి కనిపించాడు. అంతేకాకుండా.. దేశ సరిహద్దులను రక్షించే వీర సైనికులను కాంగ్రెస్ ఎంపీ ప్రశంసించారు.
ఉత్తర కొరియా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. తమ గగనతలాన్ని ఉల్లంఘించిన యూఎస్ గూఢచారి విమానాలను కూల్చివేస్తామని ఉత్తర కొరియా బెదిరించిన మరునాడే ఈ పరీక్ష నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఉత్తర కొరియా జపాన్ సముద్దం అని పిలవబడే తూర్పు సముద్రం వైపు బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిందని జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చెప్పారు.
రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య నిరవధికంగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ దాడుల్లో దక్షిణ ఉక్రెయిన్లోని కాఖోవ్కా హైడ్రో ఎలెక్ట్రిక్ డ్యామ్ తునాతునకలైంది. ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న ఈ డ్యామ్ తాలూకు వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.
ద్వీప దేశం శ్రీలంకలో మళ్లీ అత్యంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర..పుతిన్ సేనలకు భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. ఇదే విషయాన్ని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ అంగీకరించారు. తమ సైనికుల మరణాలపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌ను నిస్సైనికీకరణ చేయడం, అక్కడి నాజీ తత్వాన్ని పారదోలడమే తమ లక్ష్యమంటూ ఫిబ్రవరి 24న రష్యా సైనిక చర్యను ప్రారంభించింది. అప్పటినుంచి ఉక్రెయిన్‌పై బాంబు దాడులతో విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో అంతులేని విషాదాలు వెలుగుచూస్తున్నాయి. ఎంతోమంది ప్రజలు తమ సొంత ప్రాంతాలను వదిలి, వలస బాటపట్టారు.…
రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతున్నది. దీంతో ఉక్రెయిన్‌లో ఎటు చూసీనా భీభత్సమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏ క్షణంలో ఎటు నుంచి బాంబులు వచ్చిపడతాయో, ఎటు నుంచి తూటాలు దూసుకొస్తాయో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. రష్యా నుంచి పెద్ద సంఖ్యలో ట్యాంకర్లు విరుచుకుపడుతున్నాయి. అయితే, ఈ ట్యాంకర్లలో కొన్నింటిపై జెడ్ అనే అక్షరం రాసున్నది. ఆ అక్షరం ఏంటి? ఎందుకు జెడ్ అక్షరాన్ని దానిపై రాస్తారు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.…