MiG-21: ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్) మిగ్-21 జెట్ ఫ్లీట్ ను నిలిపివేశాయి. మే 8న రాజస్థాన్ హనుమాన్ గఢ్ గ్రామంలో మిగ్ -21 బైసన్ ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. సూరత్‌గఢ్ ఎయిర్ బేస్ నుంచి టేకాఫ్ అయిన మిగ్-21 సాంకేతిక కారణాలతో కూలిపోయింది.
మిగ్-21 బైసన్ యుద్ధ విమానాలు 60 ఏళ్లుగా కూలిపోతూనే ఉన్నాయి.. వాయుసేనలోకి ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 400 ప్రమాదాలు జరిగాయంటే.. వాటి పనితనం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
గతేడాది బాలాకోట్‌పై భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ మరుసటిరోజే పాకిస్తాన్ తక ఎఫ్ 16 విమానంతో భారత్‌పై దాడి చేయాలని చూసింది. అయితే, మిగ్ 21 విమానంతో ఎఫ్ 16 విమానాన్ని కూల్చివేసింది ఇండియా. అయితే, దీనిపై ఇప్పటి వరకు పాకిస్తాన్ క్లారిటీ ఇవ్వలేదు. భారత్ కూల్చిన ఎఫ్ 16 విమానం తమది కాదని అప్పట్లో పాక్ చెప్పింది. ఇప్పుడు మరోసారి అదే మాటను పునరావృతం చేసింది. 2019 ఫిబ్రవరిలో భారత్ పైలట్…