మైక్రోసాఫ్ట్ విండోస్‌లో తలెత్తిన సమస్య కారణంగా అన్ని సంస్థలను అతలాకుతలం చేసింది. ఈ ప్రభావం స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపించింది. గురువారం సెన్సెక్స్, నిఫ్టీ జీవితకాల గరిష్టాలను నమోదు చేసిన సూచీలు.. శుక్రవారం మాత్రం అందుకు భిన్నంగా తిరోగమనంలో కొనసాగాయి.
మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ సిస్టమ్‌లో సాంకేతిక సమస్య తలెత్తిన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచ వ్యాప్తంగా గందరగోళం నెలకొంది.. భారత్, అమెరికా సహా ప్రపంచంలోని పలు దేశాల్లో విమాన సర్వీసులు నిలిచిపోయాయి.
Microsoft Outage : మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ సిస్టమ్‌లో సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచ వ్యాప్తంగా గందరగోళం నెలకొంది.. ఇది ముంబై నుండి బెర్లిన్ వరకు ఎయిర్‌లైన్స్ నుండి బ్యాంకింగ్, స్టాక్ ఎక్స్ఛేంజీల వరకు అన్నింటిని ప్రభావితం చేసింది.
Microsoft Outage : మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో పెద్ద బగ్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ బగ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విండోస్ యూజర్ల సిస్టమ్ స్క్రీన్లు నీలం రంగులోకి మారుతున్నాయి.