వర్షాలు ఆగి రెండు రోజులైనా పొలాలన్నీ ఇంకా నీటిలోనే ఉన్నాయి.. కాలువలు ఆధునీకరించి ఉంటే ఈ ఇబ్బంది ఉండేది కాదు అని ఆరోపించారు. రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిన్న చూపు ఉంది.. రైతులు తీవ్ర నిస్పృహలో ఉన్నారు.. ఆత్మహత్యలే శరణ్యమని రైతులు భావిస్తున్నారు.. నష్టపోయిన ప్రతి రైతుకి ఏకరనికి 50 వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి అని పురంధేశ్వరి డిమాండ్ చేశారు.