Mahindra-Tata- M Evs: మహీంద్రా తన కొత్త ఎలక్ట్రిక్ ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓను అధికారికంగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధర రూ. 13.89 లక్షలు (ఎక్స్-షోరూమ్). పెట్రోల్–డీజిల్ వెర్షన్‌గా ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్న XUV 3XO, 2024 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు దాదాపు 1.8 లక్షల అమ్మకాలు నమోదు చేసింది. తాజాగా ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లోనూ ఇదే తరహాలో అమ్మకాలు సాగించాలని మహీంద్రా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ టాటా నెక్సాన్ ఈవీకి నేరుగా…
ఎంజీ మోటార్స్ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో MG విండ్సర్ EVని అందిస్తోంది. ఈ కారు 2025 వరకు అధిక డిమాండ్‌లో ఉంటుందని తయారీదారు పేర్కొన్నారు. ప్రస్తుత 2025 సంవత్సరంలో ఈ కారు దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ కారుగా మారిందని కంపెనీ పేర్కొంది. ప్రస్తుత 2024 సంవత్సరంతో పోలిస్తే 2025 సంవత్సరంలో MG మోటార్ ఇండియా అమ్మకాలలో 19% వార్షిక వృద్ధిని నమోదు చేసింది. జనవరి- డిసెంబర్ 2025 మధ్య 70,554 యూనిట్లను విక్రయించింది. ఇది…
టాటా నెక్సాన్ EV మార్కెట్ లో దుమ్మురేపింది. మార్కెట్ లో 1 లక్ష యూనిట్ల అమ్మకాలతో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. టాటా నెక్సాన్ EV ఉత్పత్తి 100,000 యూనిట్ల మార్కును దాటిందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. అంటే నేడు 100,000 కంటే ఎక్కువ నెక్సాన్ EVలు రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. భారతదేశంలో మొత్తం 2.5 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించిన రికార్డును టాటా మోటార్స్ నెలకొల్పిన పెద్ద సంఖ్యలో ఈ విజయం కూడా భాగం. దీనితో,…
రానున్న కొత్త ఏడాదిలో తన కస్టమర్లకు షాకిచ్చేందుకు రెడీ అయ్యింది ఎంజీ మోటార్స్. తన కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ధరల పెరుగుదల జనవరి 1, 2026 నుండి అమల్లోకి రానున్నట్లు తెలిపింది. కొత్త సంవత్సరం నుంచి తమ కార్ల ధరలను రెండు శాతం వరకు పెంచుతామని MG మోటార్స్ ప్రకటించింది. ఈ పెరుగుదల అన్ని వేరియంట్లలో ఒకే విధంగా ఉండదు, కానీ వాహనాన్ని బట్టి మారుతుంది. కంపెనీ ఇటీవల కొత్త హెక్టర్ SUVని విడుదల చేసింది.…
MG Windsor EV: JSW MG మోటార్ ఇండియా తమ విండ్సర్ ఎలక్ట్రిక్ వెహికల్ (EV) కు కొత్త వేరియంట్‌ను భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ఎక్స్‌క్లూజివ్ ప్రో (Exclusive Pro) పేరిట ఈ వేరియంట్‌ను లాంచ్ చేశారు. దీని ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ. 17.24 లక్షలుగా నిర్ణయించారు. అయితే, బ్యాటరీ-ఎజ్-అ-సర్వీస్ (BaaS) ఆప్షన్ తీసుకుంటే, ధరను రూ. 12.24 లక్షల (ఎక్స్‌షోరూమ్)కు తగ్గించవచ్చు. BaaS స్కీమ్‌లో కిలోమీటరుకు రూ. 4.5 చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త…
దేశీయ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు క్రమేణా ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలో వాహనదారులను ఆకట్టుకునేందుకు ఆయా సంస్థలు ఈవీలపై గట్టిగానే దృష్టి పెడుతున్నాయి. ఎలక్ట్రిక్ టూవీలర్లతోపాటు ఎలక్ట్రిక్ కార్ల వినియోగం సైతం పుంజుకుంటోంది. అందుకే టాటా, మహీంద్రా వంటి దేశీయ సంస్థలతోపాటు హ్యుందాయ్, కియా, ఎంజీ తదితర విదేశీ కంపెనీలూ భారతీయ మార్కెట్‌కు తమ ఎలక్ట్రిక్ కార్లను పరిచయం చేస్తున్నాయి.
దేశంలో రోజు రోజుకూ ఎలక్ట్రిక్ వాహనాలకు క్రేజ్ పెరుగుతోంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇప్పుడు అందరి చూపు ఈవీల వైపునకు మళ్లుతోంది. ఆకాశాన్నంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరల వల్ల ఈవీ కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈవీ వాహనాల వినియోగానికి అందిస్తున్న ప్రోత్సాహంతో కంపెనీలు పెద్ద ఎత్తున ఈవీలను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. కాగా.. ప్రస్తుతం భారతీయ మార్కెట్‌లో రూ. 11 లక్షల లోపు ఎంజీ విండ్సర్ ఈవీ , టాటా టియాగో ఈవీ,…
దేశంలోని నంబర్-1 ఎలక్ట్రిక్ కారుగా ఎమ్‌జీ విండ్సర్ ఈవీ అవతరించింది. ఇది ఇండియన్ గ్రీన్ కార్ ఆఫ్ ది ఇయర్ 2025 విజేతగా నిలిచింది. ఈ కారు ఎలక్ట్రిక్ విభాగంలో బీఎమ్‌డబ్ల్యూ, బీవైడీ వంటి కంపెనీల మోడళ్లను కూడా అధిగమించింది. ఈ విభాగంలో BMW i5 రెండవ స్థానంలో నిలువగా బీవైడీ మూడవ స్థానానికి పరిమితమైంది.
ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ ‘జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా’ తన ఎలక్ట్రిక్ కారు ‘విండ్‌సోర్’ ధరలను పెంచింది. విండ్‌సోర్ అన్ని వేరియంట్‌లపై రూ.50 వేలు పెంచుతున్నట్లు కంపనీ ప్రకటించింది. అంతేకాదు ఫ్రీ ఛార్జింగ్ ప్రయోజనాలను కూడా నిలిపివేసింది. విండ్‌సోర్ లాంచ్ సమయంలో ప్రారంభ ధరను 10వేల యూనిట్లు వరకు లేదా డిసెంబర్ 31 వరకు మాత్రమే పరిమితం అని పేర్కొంది. యాదృచ్ఛికంగా విండ్‌సోర్ ఈవీ విక్రయాలు డిసెంబర్‌లోనే 10,000 యూనిట్ల విక్రయ మైలురాయిని చేరుకుంది. దాంతో…
MG Windsor EV Price in India: భారత ఆటో మార్కెట్లో ‘ఎంజీ విండ్‌సోర్ ఈవీ’ లాంచ్ అయింది. ఇది ఎంజీ నుంచి వచ్చిన మూడో ఎలక్ట్రిక్ కారు. ఇప్పటికే భారత మార్కెట్లో జెడ్‌ఎస్ ఈవీ, కోమెట్ ఈవీలను ఎంజీ విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. విండ్‌సోర్ ఈవీ ధర రూ.9.99 లక్షల (ఎక్స్‌షోరూం) నుంచి మొదలవుతుంది.ఈ ఎలక్ట్రిక్ కారు బుకింగ్‌లు అక్టోబర్ 3 నుండి ప్రారంభమవుతాయి. ఇక అక్టోబర్ 12 నుండి డెలివరీలు మొదలవుతాయని కంపెనీ పేర్కొంది.…