MG Windsor EV Price in India: భారత ఆటో మార్కెట్లో ‘ఎంజీ విండ్‌సోర్ ఈవీ’ లాంచ్ అయింది. ఇది ఎంజీ నుంచి వచ్చిన మూడో ఎలక్ట్రిక్ కారు. ఇప్పటికే భారత మార్కెట్లో జెడ్‌ఎస్ ఈవీ, కోమెట్ ఈవీలను ఎంజీ విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. విండ్‌సోర్ ఈవీ ధర రూ.9.99 లక్షల (ఎక్స్‌షోరూం) నుంచి మొదలవుతుంది.ఈ ఎలక్ట్రిక్ కారు బుకింగ్‌లు అక్టోబర్ 3 నుండి ప్రారంభమవుతాయి. ఇక అక్టోబర్ 12 నుండి డెలివరీలు మొదలవుతాయని కంపెనీ పేర్కొంది. ఎంజీలో జేఎస్‌డబ్ల్యూ సంస్థ వాటాలు కొన్న తర్వాత విడుదల చేసిన తొలి కారు ఇదే.
జెడ్‌ఎస్ ఈవీ, కోమెట్ ఈవీలకు భిన్నంగా విండ్‌సోర్ ఈవీ ఉంది. దీనిని మిడ్‌సైజ్ క్రాసోవర్ డిజైన్‌లో తయారు చేశారు. ఈ కారులో లగ్జరీ, భద్రత మరో లెవల్లో ఉంటుంది. అత్యాధునిక ఫీచర్లతో పాటు ప్రయాణికులకు విశాలమైన స్పేస్ ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న విద్యుత్తు కార్లతో పోలిస్తే.. విండ్‌సోర్ డిజైన్ విభిన్నంగా ఉంది. ఇది లుక్స్ పరంగా ఇండోనేషియా మార్కెట్‌లోని ఉలుంగ్ క్లౌడ్ ఈవీ తరహాలో ఉంటుంది. కాకపోతే భారత్‌లో కొన్ని అప్‌డేట్స్ చేశారు.
విండ్‌సోర్ ఈవీ మూడు వేరియంట్‌లలో (ఎక్సైట్, ఎక్స్‌క్లూజివ్, ఎసెన్స్) అందుబాటులో ఉంటుంది. ఇందులో సింగల్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంది. 38 కిలోవాట్స్ బ్యాటరీ ప్యాక్ ఉండగా.. 134 బీహెచ్‌పీ శక్తిని, 200 ఎన్‌ఎం పీక్ టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ బ్యాటరీని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే.. 331 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. కంపెనీ సరికొత్తగా బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ (బీఏఏఎస్) ప్రోగ్రాంను ప్రారంభించింది. దాంతో కిలోమీటర్‌కు రూ.3.5 చొప్పున చెల్లించి బ్యాటరీని అద్దెకు కూడా తీసుకోవచ్చు. ఇక ఈ కారులో ఎకో, ఎకో ప్లస్, నార్మల్, స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి.
Also Read: Fridge Explodes: ఉమెన్స్ హాస్టల్‌లో పేలిన ఫ్రిడ్జ్.. ఇద్దరు యువతులు మృతి!
విండ్‌సోర్ ఈవీ 4295 ఎంఎం పొడవు, 1652 ఎంఎం ఎత్తు, 1850 ఎంఎం వెడల్పు ఉంటుంది. వీల్‌బేస్ 2700 ఎంఎంగా ఉండడంతో వెనుక సీట్లు మరింత సౌకర్యవంతంగా ఉండనున్నాయి. ముందు సీట్లను విమానాల్లోని ఫస్ట్‌క్లాస్ సెక్షన్లలో వలే 135 డిగ్రీల్లో వాల్చుకోవచ్చు. 18 అంగుళాల అలాయ్ వీల్స్, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్, ఫ్రంట్ ఛార్జింగ్ ఇంటెల్ లైట్లు, వెనుకవైపు ఎల్‌ఈడీ టెయిల్ లైట్ ఉన్నాయి. 8.8 అంగుళాల డ్రైవర్ డిస్‌ప్లే, 15.6 అంగుళాల ప్రధాన ఇన్ఫోటెయిన్‌మెంట్ స్క్రీన్ ఉంటాయి. లెవల్ 2 అడాస్, 360 కెమెరా, ఆరు ఎయిర్ బ్యాగులు వంటి భద్రతా ప్రమాణాలు ఉన్నాయి.
Launching a new #Businessclass with the all-new #MGWindsorEV designed to redefine travel as an indulgence.
Witness a new era that takes luxury, comfort and safety to a whole new level.
Get ready to turn your every drive into a business class experience. #IntelligentCUV
— Morris Garages India (@MGMotorIn) September 11, 2024