తెలుగు చిత్రసీమలోనే కాదు, ప్రపంచ చలనచిత్రసీమలోనే ఓ అరుదైన అద్భుతం విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు. ఆయన జయంతి అయిన మే 28వ తేదీ అభిమానులకు ఓ పర్వదినం. 1923 మే 28న కృష్ణాజిల్లా నిమ్మకూరులో కన్ను తెరచిన యన్టీఆర్, తరువాత జనం మదిలో ‘అన్న’గా నిలచి జేజేలు అందుకున్నారు. ఆయన నటజీవితం, రాజకీయ ప్రస్థానం గమనిస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యధిక పౌరాణిక పాత్రల్లో అలరించిన ఘనత యన్టీఆర్ సొంతం. జానపదాల్లో…