మెర్సర్స్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ర్యాంకింగ్స్ 2023లో హైదరాబాద్ "భారతదేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరం"గా ర్యాంక్ చేయబడింది.. ఈ జాబితాలో 153వ ర్యాంక్‌తో హైదరాబాద్ టాప్ స్పాట్‌లో నిలవగా.. ఆ తర్వాత 154వ ర్యాంక్‌తో పుణె రెండో స్థానం, 156వ ర్యాంక్‌తో బెంగళూరు మూడో స్థానం, 161 ర్యాంక్‌తో చెన్నై నాలుగో స్థానం, 164 ర్యాంక్‌తో ముంబై ఐదో స్థానం, 170 ర్యాంక్‌తో కోల్‌కతా ఆరో స్థానం, 172 ర్యాంక్‌తో న్యూఢిల్లీ ఏడో స్థానంలో నిలిచాయి.