మంత్రి మేకపాటి అధ్యక్షతన పరిశ్రమల శాఖపై సమీక్ష నిర్వహించారు. ఏపీలో 2 మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు చేయనున్నారు. అయితే త్వరలో ప్రత్యేక లాజిస్టిక్ పాలసీ-2021 వస్తుంది అని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. అయితే లాజిస్టిక్ పాలసీ -2021 పై కసరత్తు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తరహాలో ఈజ్ ఆఫ్ లాజిస్టిక్స్… మౌలిక సదుపాయలకు పెద్దపీట వేస్తుంది ఏపీ. కేంద్రస్థాయిలో అథారిటీ ఏర్పాటులో భాగంగా ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించి సీఎస్ ఛైర్మన్ గా లాజిస్టిక్స్ సమన్వయ కమిటీ (ఎస్ఎల్ సీసీ) ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసారు. మేజర్, మైనర్ పోర్టులు, కోల్డ్ స్టోరేజ్ లు, వేర్ హౌస్ లు, సరకు రవాణా వాహనాలు ఇందులో కీలకం. పాలసీ రూపకల్పనలో భాగంగా సింగపూర్ తరహా దేశాలలో మోడళ్లను పరిశీలించింది ఏపీ.
ఇక వ్యాపారులు, తయారీదారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను మంత్రికి వివరించారు పరిశ్రమల శాఖ డైరెక్టర్… ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పెట్టారు. పోర్టుల సరకు రవాణా సామర్థ్యం పెంపు సహా, నాన్ మేజర్ పోర్టులలో 2020లో ఉన్న 50 శాతం సరకు రవాణాను 2026 కల్లా 70 శాతానికి చేర్చే ప్రణాళిక వేస్తుంది. క్రిష్ణపట్నం, కాకినాడ పోర్టుల సమీపంలో 100 ఎకరాలలో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులు రానున్నాయి.