(మార్చి 23న శ్రీకాంత్ పుట్టినరోజు)సినిమా రంగం అంటే ఎంతోమందికి మోజు. అక్కడ రాణించాలని, తారాపథంలో సాగిపోవాలని ఎంతోమంది కలలుకంటూ ఉంటారు. ఊహాలోకాల్లో విహరిస్తూ ఉంటారు. ఏదైనా సినిమా చూసి, అందులో తనకు నచ్చిన పాత్రను తానయితే ఇలా చేస్తాననీ కలల్లో తేలిపోతారు. అయితే స్వప్నాలను సాకారం చేసుకొనేవారు కొందరే ఉంటారు. చిత్రసీమలో అలాంటివారికి కొదువలేదు. వారిలో నిన్నటి హీరో, నేటి కేరెక్టర్ యాక్టర్, విలన్ శ్రీకాంత్ కూడా ఉన్నారు. బిట్ రోల్స్ లో మొదలైన శ్రీకాంత్ సినీ…
తెలుగులో రోడ్ జర్నీ మూవీస్ చాలా అరుదు. ఆ లోటును తీర్చడానికే కావచ్చు నూతన దర్శకుడు గురు పవన్ ‘ఇదే మా కథ’ చిత్రాన్ని తెరకెక్కించారు. శ్రీకాంత్, సుమంత్ అశ్విన్, భూమిక, తన్యా హోప్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను జి. మహేశ్ నిర్మించారు. గాంధీ జయంతి కానుకగా ‘ఇదే మా కథ’ అక్టోబర్ 2న జనం ముందుకు వచ్చింది. ఇదో నలుగురు వ్యక్తుల జీవిత కథ. యుక్త వయసులో లడక్ లో తనకు తారస…
(జూన్ 21న ‘మధురానగరిలో…’కు 30 ఏళ్ళు) భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత ఎస్. గోపాలరెడ్డికి ‘ఎమ్’ సెంటిమెంట్ లెటర్ అని చెప్పాలి. ఆయన నిర్మించిన ‘మనిషికో చరిత్ర, ముక్కుపుడక, మంగమ్మగారి మనవడు, మాపల్లెలో గోపాలుడు, ముద్దుల క్రిష్ణయ్య, మువ్వగోపాలుడు, మురళీకృష్ణుడు, మన్నెంలో మొనగాడు, ముద్దుల మావయ్య, ముద్దుల మేనల్లుడు, మాతో పెట్టుకోకు’ చిత్రాలన్నీ అలా ‘మ’ అక్షరంతో మొదలయినవే. వాటిలో బాలకృష్ణతో తెరకెక్కించిన చిత్రాల్లో ఒకటి రెండు మినహా అన్నీ బంపర్ హిట్స్, ఇక యాక్షన్ హీరో…