కొన్ని సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఆడియన్స్ ని మెప్పించడంలో విఫలమయ్యి, కాలక్రమేనా కొన్నేళ్ల తర్వాత కల్ట్ క్లాసిక్ స్టేటస్ అందుకుంటూ ఉంటాయి. ఈ కేటగిరిలో చాలా సినిమాలే ఉన్నాయి కానీ అన్నింటికన్నా ఎక్కువగా చెప్పుకోవాల్సింది మాత్రం ‘ఆరెంజ్’ సినిమా గురించే. ‘మగధీర’ ఇండస్ట్రీ హిట్ అవ్వడంతో రామ్ చరణ్ మూడో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకే రేంజులో ఉండేవి. మాస్ సినిమా చేసి ఆ అంచనాలు అందుకుంటాడు అనుకుంటే చరణ్, తన మూడో సినిమాగా ‘బొమ్మరిల్లు భాస్కర్’…