Ram Charan: ఆ కల్ట్ సినిమాకి 12 ఏళ్లు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొన్ని సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఆడియన్స్ ని మెప్పించడంలో విఫలమయ్యి, కాలక్రమేనా కొన్నేళ్ల తర్వాత కల్ట్ క్లాసిక్ స్టేటస్ అందుకుంటూ ఉంటాయి. ఈ కేటగిరిలో చాలా సినిమాలే ఉన్నాయి కానీ అన్నింటికన్నా ఎక్కువగా చెప్పుకోవాల్సింది మాత్రం ‘ఆరెంజ్’ సినిమా గురించే. ‘మగధీర’ ఇండస్ట్రీ హిట్ అవ్వడంతో రామ్ చరణ్ మూడో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకే రేంజులో ఉండేవి. మాస్ సినిమా చేసి ఆ అంచనాలు అందుకుంటాడు అనుకుంటే చరణ్, తన మూడో సినిమాగా ‘బొమ్మరిల్లు భాస్కర్’ దర్శకత్వంలో ‘ఆరెంజ్’ సినిమాని అనౌన్స్ చేయడమే అందరినీ ఆశ్చర్యపరిచింది.
‘ఆరెంజ్’ సినిమా ప్యూర్ లవ్ స్టొరీగా ఆడియన్స్ ముందుకి వచ్చింది. ఈ మూవీలో చరణ్ ‘ప్రేమ కొంత కాలమే బాగుంటుందని’ చెప్పిన డైలాగ్ ని నిజం చేస్తూ ఇప్పటికీ ఎన్నో ప్రేమకథలు మన రెగ్యులర్ లైఫ్ లో కనిపిస్తూ ఉంటాయి. ఆరెంజ్ సినిమా రిలీజ్ అయిన టైం తప్పో లేక మాస్ హీరో నుంచి క్లాస్ సినిమా ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదో తెలియదు కానీ థియేటర్స్ లో ఆరెంజ్ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని మెప్పించలేదు. ఆరెంజ్ సినిమా ఫ్లాప్ అయ్యింది అనే మాటే కానీ ఈ మూవీలో చరణ్ లుక్స్ కి మంచి పేరొచ్చింది. ఇక సాంగ్స్ విషయానికి వస్తే తెలుగులో సూపర్ హిట్ అయిన ఆల్బమ్స్ లో ‘ఆరెంజ్’ సినిమా ఒకటి. ఈ మూవీలోని అన్ని పాటలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. జెనీలియా హీరోయిన్ గా నటించిన ఈ మూవీ 2010 నవంబర్ 26న రిలీజ్ అయ్యింది. గత పుష్కర కాలంలో కల్ట్ లవ్ స్టొరీ సినిమా అనే టాపిక్ వచ్చిన ప్రతిసారీ ‘ఆరెంజ్’ సినిమా పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఈ మూవీ రిలీజ్ అయ్యి నేటికి 12 ఏళ్లు కావడంతో మెగా అభిమానులు సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు.
Also Read
- Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతోన్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'సైయారా' జోడి
- Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
- Dhanush : సితార ఎంటర్టైన్మెంట్స్లో 'లబ్బర్ పండు' దర్శకుడితో ధనుష్
- Nani Next Movies: ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని వరుస సినిమాలు.. 2027లో ఏకంగా మూడు కొత్త ప్రాజెక్టులు!
తాజావార్తలు
-
Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతోన్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సైయారా’ జోడి
-
Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
-
India Matches: 3 నెలలు, 28 మ్యాచ్లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
-
Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
-
Dhanush : సితార ఎంటర్టైన్మెంట్స్లో ‘లబ్బర్ పండు’ దర్శకుడితో ధనుష్
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!