రాష్ట్రంలో కుల ధ్రువీకరణ పత్రాలను పొందడంలో ఎదురయ్యే ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఈ సర్టిఫికెట్లు పొందడానికి దరఖాస్తు చేసి, ఎమ్మర్వో ఆమోదం కోసం వేచి చూడాల్సి వచ్చేది.
మీసేవ ద్వారా రేషన్ కార్డుల దరఖాస్తులపై పౌరసరఫరాల శాఖ క్లారిటీ ఇచ్చింది. మీసేవ ద్వారా కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని పౌరసరఫరాల శాఖ తెలిపింది. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను ఆన్‌లైన్ చేయాలని మాత్రమే "మీసేవ"ను కోరినట్లు పౌరసరఫరాల శాఖ కమిషన్ డీఎస్ చౌహాన్ తెలిపారు.