జిల్లాలకు కొత్త ఉన్నతాధికారులు వచ్చినప్పుడు, రాజకీయ నేతలకు ఊహించిన పదవులు దక్కినప్పుడు... ఆ మాటలే వేరుగా ఉంటాయి. ఇంకేముంది... ఇరగదీసేస్తాం... దున్నేస్తాం...మనకడ్డేలేదంటూ మాటలు పేలుతుంటాయి. సరే... చేతల్లోకి వచ్చేసరికి అది ఎంతవరకన్నది వేరే సంగతి. ఇప్పుడిదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోందని అంటే.... తెలంగాణ కాంగ్రెస్‌లో మారుతున్న వాతావరణానికి సంబంధించిన చర్చ. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్‌గా మీనాక్షి నటరాజన్ వచ్చేశారు. కానీ... ఆమె రొటీన్‌కి భిన్నంగా వ్యవహరిస్తున్నారు.