హైదరాబాద్ శివారులో పసి పిల్లల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. మేడిపల్లి కేంద్రంగా పసి పిల్లల అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ఓ ఆర్ఎంపీ డాక్టర్ ఇతర రాష్ట్రాల నుంచి పిల్లల్ని తెచ్చి పిల్లలు లేని తల్లిదండ్రులకు అమ్ముతున్నాడు. ఒక్కో పిల్లాడిని రూ. 5 లక్షల వరకు అమ్ముతుంది ఈ ముఠా. ఈ విషయం తెలుసుకున్న బాలల హక్కుల సంఘం ఈ విషయాన్ని గుట్టురట్టు చేసింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. దీంతో.. పోలీసులు అక్కడికి చేరుకుని ముఠాను అరెస్ట్ చేశారు.…