గడిచిన 115 రోజులుగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఉద్దేశ్యపూర్వకంగా జైలులో ఉంచారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఎలాగైనా ఆయన్ని ఇబ్బందులు పెట్టాలని కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.. పేర్ని నాని శనివారం మీడియాతో మాట్లాడారు. ఒక కేసులో బెయిలు వస్తుందంటే మరో కొత్త కేసు నమోదు చేస్తున్నారన్నారు.. కేసు మీద కేసు అంటూ తప్పుడు కేసులు పెడుతున్నారని.. వంశీ విషయంలో దేవుడు ఉన్నాడు..
వల్లభనేని వంశీ రెండు రోజుల కస్టడీ పూర్తి అయింది.. బాపులపాడు నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో నమోదైన కేసుకి సంబంధించి వంశీని రెండ్రోజుల పాటు పోలీసులు విచారించారు. వంశీని 30కిపైగా ప్రశ్నలు అడిగారు. నకిలీ ఇళ్ల పట్టాలను ఎక్కడ ఎవరు ఎందుకు తయారు చేసారని వంశీని పోలీసులు ప్రశ్నించారు. నకిలీ ఇళ్ల పట్టాల తయారీలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనే విషయాల్ని అడిగారు. తనకు నకిలీ పట్టాలతో సంబంధం లేదని వంశీ సమాధానం చెప్పారు.
తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో రేపటి నుండి క్యాన్సర్ కేసుల అంశంపై మరోసారి సమగ్ర సర్వే నిర్వహించనున్నారు. క్యాన్సర్ కేసులు విషయంలో అధికారుల లెక్క, వాస్తవ పరిస్థితులకు భిన్నమైన వాదన ఉన్న నేపథ్యంలో గ్రామంలో మరోసారి సమగ్ర సర్వే చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి ఇంటింటి సర్వే నిర్వహించి రొమ్ము, గర్భాశయ, ముఖద్వారం, ఓరల్ క్యాన్సర్ ప్రాథమిక నిర్ధారణ పరీక్షలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో జిల్లా వైద్యాధికారులు చర్చించి…
వైద్యాన్ని వ్యాపారంగా చేసుకుని డబ్బులు దండుకుంటున్నారు కొందరు డాక్టర్లు.. ఆసుపత్రిలో చేరే పేషెంట్ల ఆర్ధిక స్థితిని బట్టి.. వాళ్ల అమాయకత్వాన్ని ఆధారంగా చేసుకొని డబ్బులు లాగేస్తున్న ఘటనలు నిత్యం ఏదో ఓ చోట వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఠాగూర్ సినిమాలో ప్రాణం పోయిన వ్యక్తికి ట్రీట్‌మెంట్ చేస్తున్నట్లుగా మేనేజ్ చేసి పేషెంట్ల నుంచి డబ్బులు వసూలు చేసే సీన్ అందరికి గుర్తుండిపోతుంది.
kidney Operation: రాజస్థాన్‌లో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతోంది. రాష్ట్రంలోని జుంజునులో కిడ్నీలో రాళ్లు ఉండటంతో మహిళను ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.
Medical Negligence: కేరళలోని కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. నాలుగేళ్ల బాలిక చేతి వేళ్లకు చేయాల్సిన ఆపరేషన్‌ని నాలుకకు చేశారు.
ఎమ్మిగనూరులో వైద్యుని నిర్లక్ష్యంతో శిశువు మృతి పై అధికారులు స్పందించారు. శిశువు మృతిపై NTV లో వరుస కథనాలు ప్రసారం కావడంతో.. జిల్లా వైద్యాధికారిణి సత్యవతి విచారణ చేపట్టారు. బాలుడికి చికిత్స కోసం తీసుకొచ్చిన సూర్యతేజ హాస్పిటల్ లో రిటైర్డ్ సూపరెంటెండెంట్ డా. బాలయ్యను వైద్య అధికారులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా.. శిశువుకు చికిత్స చేసిన డాక్టర్ రాఘవేంద్ర వివరాలపై ఆరా తీస్తున్నారు.
వైద్యుడిని దేవుడితో పోలుస్తాం. దేవుడు ప్రాణం పోస్తే డాక్టర్ ఆ ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా కాపాడతాడు. అందుకే సమాజంలో వైద్యులకు విశేష ప్రాధాన్యత కట్టబెట్టారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు కేంద్రంలో ఆరుగురు బాలింతలకు అస్వస్థత గురయ్యారైన ఘటన మరువకముందే.. నాగర్ కర్నూలు జిల్లా ఎటువంటి వైద్య పరీక్షలు చేయకుండా ఓ బాలింత ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపుతుంది.
చెవినొప్పితో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్లిన ఓ యువతి తన ఎడమచేతిని కోల్పోయిన ఘటన బిహార్ రాజధాని పాట్నాలో చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం.. యువతి ప్రాణాలకే ముప్పును తెచ్చిపెట్టింది.