వైద్యాన్ని వ్యాపారంగా చేసుకుని డబ్బులు దండుకుంటున్నారు కొందరు డాక్టర్లు.. ఆసుపత్రిలో చేరే పేషెంట్ల ఆర్ధిక స్థితిని బట్టి.. వాళ్ల అమాయకత్వాన్ని ఆధారంగా చేసుకొని డబ్బులు లాగేస్తున్న ఘటనలు నిత్యం ఏదో ఓ చోట వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఠాగూర్’ సినిమాలోని ఆసుపత్రి సీన్ గుర్తుందా? అప్పట్లో అది పెను సంచలనమే అయ్యింది. వ్యక్తి చనిపోయినా అతడు బ్రతికే ఉన్నాడంటూ అబద్ధం చెప్పి.. వైద్యం పేరుతో లక్షలకు లక్షలు ప్రైవేటు ఆసుపత్రులు కాజేస్తుంటాయని ఆ సినిమాలో కళ్లకు కట్టినట్టుగా చూపించారు. ఆ సినిమాలో చూపించినట్టుగానే.. రియల్ లైఫ్‌లోనూ కొన్ని సంఘటనలు జరిగాయి. తాజాగా.. అలాంటి ఘటన హైదరాబాద్‌లో జరిగింది.
Read Also: Tamilnadu : తమిళనాడులో వీధి కుక్కల బారీన పడిన 14వేల మంది
వివరాల్లోకి వెళ్తే.. ఓ అమ్మాయిని చికిత్స కోసం తీసుకురాగా, వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆ యువతి చనిపోయింది. ఈ ఘటన మియాపూర్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో జరిగింది. సుహాసిని (26) అనే యువతికి కళ్ళు తిరిగి పడిపోతే కడప హాస్పిటల్ నుండి ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్‌లోని ప్రైవేట్ హాస్పిటల్‌కి తీసుకొచ్చారు బంధువులు. కానీ నెల రోజుల నుండి పేషెంట్‌కి ట్రీట్మెంట్ చేస్తున్నామని నమ్మబలికి 12 లక్షల 50 వేలు బిల్ కట్టించుకున్నారు.
Read Also: Gang Rape: హైదర్షాకోట్ గ్యాంగ్ రేప్లో సంచలన విషయాలు..
ఇంక బ్యాలెన్స్ రూ.5 లక్షలు బిల్ కట్టండని, పాప బతుకుతుంది అని నమ్మబలికారు.. కానీ ఈరోజు ఉదయం బిల్ కట్టనక్కర్లేదు అని.. నిమ్స్ ఆస్పత్రిలో జాయిన్ చేస్కోండి అని హాస్పిటల్ యాజమాన్యం చెప్పింది. దీంతో.. బాలిక పేరెంట్స్ నిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లగా ఎమర్జెన్సీ వార్డులో పరిశీలించిన వైద్యులు యువతి చనిపోయిందని చెప్పారు. దీంతో యువతి మృతదేహాన్ని తిరిగి సిద్ధార్థ్ న్యూరో ఆస్పత్రికి తీసుకొచ్చిన బంధువుల తమకు న్యాయం చేయాలని ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. మూడు, నాలుగు రోజుల క్రితమే చనిపోయినా తమకు ఇప్పటి వరకు సమాచారం అందించలేదని.. సిద్ధార్థ హాస్పిటల్ పైన తగిన చర్యలు తీసుకోవాలంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.