NEET 2023 Results: మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్(NEET) 2023 ఫలితాలు విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ కు చెందిన వరుణ్ చక్రవర్తి, తమిళనాడుకు చెందిన ప్రభంజన్ ఈ ఏడాది జాతీయ స్థాయిలో టాపర్లుగా నిలిచారు. 99.99 పర్సంటైల్ స్కోర్ తో అగ్రస్థానంలో నిలిచారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) మంగళవారం ప్రకటించింది. మొత్తం 20.38 లక్షల మంది అభ్యర్థులు నీట్ పరీక్షను రాయగా.. 11.45 లక్షల మంది అభ్యర్థులు అర్హత సాధించారు.
Student Suicide: రాజస్థాన్ కోటాలో మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ పరీక్షకు కోచింగ్ తీసుకుంటున్న 18 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్ గదిలోనే ఉరేసుకుని మరణించింది. తక్కువ మార్కులు వస్తున్నాయన్న మనస్తాపంలోనే తమ కుమార్తె ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.