AP, Telangana: ఇంటర్నేషనల్ మార్కెట్లలో వైద్య పరికరాల ఎగుమతుల ప్రోత్సాహకానికి ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్‌ని ఏర్పాటుచేసినట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫార్మాస్యుటికల్స్ డిపార్ట్‌మెంట్‌లో భాగంగా పనిచేసే ఈ కౌన్సిల్ హెడ్‌క్వార్టర్స్ నోయిడాలో ఉంటుందని, బ్రాంచ్ ఆఫీసులు ఏపీ, తెలంగాణల్లో ఉంటాయని పేర్కొంది. మన దేశం గత ఆర్థిక సంవత్సరంలో 23 వేల 766 కోట్ల రూపాయల విలువైన మెడికల్ డివైజ్‌లను ఎగుమతి చేసింది.