వరంగల్ జిల్లాలో పలు ఆసుపత్రులకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 17వ తేదీన నర్సంపేట రోడ్డులోని ఎస్‌ఎస్ గార్డెన్‌లో జరిగిన ఆర్‌ఎంపీ, పీఎంపీల ప్రథమ మహా సభలో పలువురు వైద్యులు, జాతీయ- రాష్ట్ర వైద్య మండలి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని మెడికల్ కౌన్సిల్ ఆరోపించింది.