ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ కారణంగా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కర్నూలు మెడికల్ కాలేజీలో కరోనా కలకలం రేగింది. కర్నూలోని మెడికల్ కాలేజీలో 15 మంది వైద్య విద్యార్థులకు కరోనా సోకింది. మొత్తం 50 మంది వైద్య విద్యార్థులకు కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా ఎంబీబీఎస్ ఫస్టీయర్ చదువుతున్న 11 మంది విద్యార్థులకు, నలుగురు హౌస్ సర్జన్‌లకు కరోనా సోకింది. మరో 40 మంది వైద్య విద్యార్థుల నుంచి శాంపిల్స్‌ను సేకరించి…
సూర్యాపేట వైద్య కళాశాలలో ర్యాగింగ్ ఘటనలో…ఆరుగురు వైద్య విద్యార్థులను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ డీఎంఈ రమేశ్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వసతి గృహం నుంచి శాశ్వతంగా పంపించేశారు. సూర్యాపేట ర్యాగింగ్ ఘటనపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. జూనియర్ విద్యార్థిని ర్యాగింగ్ చేసి ఇబ్బందులకు గురిచేసిన ఆరుగురు సీనియర్ విద్యార్థులను సస్పెండ్ చేస్తూ డీఎంఈ రమేష్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. 2019-20 బ్యాచ్‌కు చెందిన ఆరుగురు విద్యార్థులు జె.మహేందర్, జి.శశాంక్,…
దేశవ్యాప్తంగా మరోసారి కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. బీహార్‌లోనూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా బీహార్‌లోని నలంద మెడికల్ కాలేజీలో సోమవారం 72 మంది డాక్టర్లు కరోనా బారిన పడగా… తాజాగా మరో 59 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు మొత్తం 143 మంది డాక్టర్లు కరోనాతో బాధపడుతున్నారని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో గత మూడు, నాలుగు రోజులుగా ఆయా డాక్టర్లను కలిసిన వారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.…
ప్రస్తుతం తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ కరోనా మధ్యలోనే ప్రస్తుతం అన్ని విద్య సంస్థలు నడుస్తున్నాయి. ఇక తాజాగా కరీంనగర్ జిల్లాలో కరోనా కలకలం రేపింది. కరీంనగర్ లోని ఒక ప్రయివేట్ మెడికల్ కళాశాలలో 39 మంది వైద్య విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అలాగే మరికొంత మంది విద్యార్థులకు కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు వైద్య సిబ్బంది. ఇక కళాశాలలో ఒక్కేసారి ఇన్ని కరోనా కేసులు…
కర్ణాటక మెడికల్ కాలేజీలో ఫ్రెషర్స్ పార్టీ కొంపముంచింది. కరోనా నిబంధనలు గాలికొదిలేసి ఫ్రెషర్స్ పార్టీ జరుపుకోవడంతో… వందలాది మంది విద్యార్థులు వైరస్ బారిన పడ్డారు. ధార్వాడ్ మెడికల్ కాలేజీలో కరోనా కేసుల సంఖ్య 182కు చేరింది. విద్యార్థులతోపాటు సిబ్బంది కూడా వైరస్ బారినపడ్డారు. దీంతో ధార్వాడ్ మెడికల్ కాలేజీ కోవిడ్ క్లస్టర్‌గా మారిపోయింది. బాధితుల్లో మెజార్టీ సంఖ్య టీకా రెండు డోసులు తీసుకొన్నవారే కావడం.. మరింత టెన్షన్ పుట్టిస్తోంది. ధార్వాడ్ జిల్లాలోని ఎస్‌డీఎమ్ కాలేజ్ ఆఫ్ మెడికల్…
కరోనా సమయంలో నేర్చుకున్న పాఠాలను దృష్టిలో పెట్టుకొని వైద్యరంగానికి పెద్ద పీఠ వేసేదిశగా కేంద్రం అడుగులు వేస్తున్నది. ఆరోగ్యరంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడంతో పాటుగా స్వయం సమృద్ది సాధించేందుకు కృషి చేస్తున్నామని ప్రధాని మోడి పేర్కొన్నారు. ఇందులో భాగంగానే దేశంలోని ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ లేదా పీజీ వైద్య విద్యాకేంద్రాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రధాని మోడి పేర్కొన్నారు. ఈరోజు రాజస్థాన్‌లోని…
రామగుండంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు కానుండటంతో మంత్రి కేటీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, టీబీజీకేఎస్ నేతలు వెంకట్ రావు, మిర్యాల రాజిరెడ్డి. అయితే ఆ మెడికల్ కాలేజ్ లో 25% సీట్లు సింగరేణి కార్మికుల పిల్లలకు కేటాయించాలని మంత్రి కేటీఆర్ ను కోరారు. ఇక రామగుండంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలంటూ, గతంలో సీఎం కేసీఆర్ ను కోరారు ఎమ్మెల్సీ కవిత. అయితే రామగుండంలో మెడికల్…
సంగారెడ్డికి మెడికల్ కాలేజీ ప్రకటించినందుకు చాలా సంతోషమని..ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేసీఆర్ కు కృతజ్ఞతలు అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుండి సంగారెడ్డి మెడికల్ కాలేజీ కోసం తాను పోరాటం చేస్తున్న సంగతి ప్రజలకు తెలుసని.. దాదాపు 10 నియోజకవర్గాల ప్రజలతోపాటు భీదర్ నుండి వచ్చే ప్రజలకు సంగారెడ్డి లో మెడికల్ కాలేజీ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. గెలిచిన తర్వాత అసెంబ్లీలో సమయం వచ్చిన ప్రతిసారి మెడికల్ కాలేజ్ ఇవ్వాలని సీఎంను…